AP News: ప్రారంభానికి సిద్ధమైన నెల్లూరు, సంగం బ్యారేజీలు

ABN , First Publish Date - 2022-09-05T01:53:10+05:30 IST

నెల్లూరు జిల్లా (Nellore District) వాసుల దశాబ్దల కల, వేలమంది రైతుల చిరకాల కోరిక అయిన నెల్లూరు

AP News: ప్రారంభానికి సిద్ధమైన నెల్లూరు, సంగం బ్యారేజీలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా (Nellore District) వాసుల దశాబ్దల కల, వేలమంది రైతుల చిరకాల కోరిక అయిన నెల్లూరు, సంగం బ్యారేజీ (Nellore Sangam Barrage)లు ప్రారంభానికి  సిద్ధం అయ్యాయి. భూగర్భ జలాలను పెంపొందించడంతోపాటు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే ఈ రెండు ప్రాజెక్టులు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. బ్యారేజీల నిర్మాణానికి 2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో శంకుస్థాపన జరగగా, ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు వేగం పుంజుకున్నాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో కొంతకాలం ఒడిదుడుకులు ఎదురైనా ఎట్టకేలకు పనులు పూర్తికావచ్చాయి. నెల్లూరు, సంగంలోని మేకపాటి గౌతమ్‌ రెడ్డి (Mekapati Goutham Reddy) సంగం బ్యారేజీలను ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.


సంగం బ్యారేజీని 0.45టీఎంసీల నీటినిల్వ చేసే విధంగా రూపొందించారు. రూ.147.50 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. ఆ తరువాత రాష్ట్ర విభజనకు ముందు అంటే 2008-2014 మధ్యన కేవలం రూ.30.85కోట్లు విలువ చేసే పనులు మాత్రమే జరిగాయి. తరువాత డిజైన్లలో మార్పులు రావడంతో సంగం బ్యారేజీ సవరించిన అంచనా విలువ రూ.335.80కోట్లకు పెరిగింది. అయితే నెమ్మదిగా జరుగుతున్న పనులు రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ప్రభుత్వంలో ఊపందుకున్నాయి. 2014-19 మధ్య రూ.86.10 కోట్ల పనులు జరిగాయి. దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అధికారంలోకి వచ్చిన తరువాత బిల్లుల సమస్యతో కొంతకాలం పనుల్లో జాప్యం జరిగింది. అయితే తరువాత ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనుల్లో వేగం పెరిగింది.

Updated Date - 2022-09-05T01:53:10+05:30 IST