Abn Andrajyothy Effect: కదిలిన నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు

ABN , First Publish Date - 2022-08-24T20:01:12+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ తో జిల్లా ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. నెల్లూరు పట్టణం సమీపంలోని అల్లీపురం ప్రాంతంలో ..

Abn Andrajyothy Effect: కదిలిన నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు

నెల్లూరు (Nellore): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ (Abn Andhrajyothy Effect)తో జిల్లా ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది.  నెల్లూరు పట్టణం సమీపంలోని అల్లీపురం ప్రాంతంలో ప్రభుత్వ, ఇరిగేషన్ భూములను (Government Lands) ఆక్రమించిన కొందరు రియల్టర్లు (Realtors) అనధికారిరంగా లే అవుట్లు వేశారు. దీంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  వరుస కథనాలు ప్రసారం చేసింది. స్థానిక రైతులు చేసిన ఆందోళనలను కూడా రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది.  అంతే నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు (Nellore District Collector Chakradhar Babu) స్పందించారు. రియల్టర్లకి జరిమానాలు విధించారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వీఆర్వో, ఆర్ఐలకు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే జిల్లాలో ఇలాంటి ఆక్రమణలు చాలా ఉన్నాయని వాటిపై కూడా అధికారులు దృష్టించాలని రైతులు అంటున్నారు. 


Updated Date - 2022-08-24T20:01:12+05:30 IST