
అమరావతి: నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. మంత్రి కాకాణి, ఆనం వేంరెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్‌కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. మాట్లాడుకుందాం రా అంటూ అనిల్‌కు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జగన్‌ను అనిల్ కలవనున్నారు.
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు వైసీపీలో విబేధాలు రోడ్డున పడ్డాయి. కాకాణి, ఆనం, వేంరెడ్డి వర్గాలకు అనిల్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఘాటు విమర్శలు చేయడం, ఫ్లెక్సీలు తొలగించడం వంటి వ్యవహారాలతో అనిల్ వైసీపీలో వేడి పెంచారు. చివరకు అనిల్‌కు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది.
ఇవి కూడా చదవండి