పోలీసుల్లో వణుకు.. ఒకే స్టేషన్‌లో 12 పాజిటివ్‌లు?

ABN , First Publish Date - 2020-07-14T18:18:01+05:30 IST

పోలీసు శాఖను కరోనా వణికించేస్తోంది. కొద్దిరోజులుగా జిల్లాలోని ..

పోలీసుల్లో వణుకు.. ఒకే స్టేషన్‌లో 12 పాజిటివ్‌లు?

నెల్లూరు: పోలీసు శాఖను కరోనా వణికించేస్తోంది. కొద్దిరోజులుగా జిల్లాలోని ఏదో ఒక పోలీసు స్టేషన్‌లోని సిబ్బందికి పాజిటివ్‌ కేసు నమోదవుతోంది. ఇప్పటకే పలువురు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐ, మహిళ కానిస్టేబుల్‌, హోమ్‌గార్డులు ఇలా పదుల సంఖ్యలో వైరస్‌ సోకింది. ఇటీవల వెంకటగిరి స్టేషన్‌లో అత్మధికంగా సిబ్బందికి కరోనా సోకడంతో పెద్ద చర్చగా మారింది. తాజాగా నెల్లూరులోని నవాబుపేట పోలీసుస్టేషన్‌లో 12 మంది సిబ్బందికి వైరస్‌ సోకినట్లు సమాచారం. ఈ పలితాలు వచ్చిన వెంటనే స్టేషన్‌లో శానిటైజేషన్‌ చేశారు. మర మారు సిబ్బందికి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 

Updated Date - 2020-07-14T18:18:01+05:30 IST