టిక్‌టాక్ వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపే స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు.. చివరికి..

ABN , First Publish Date - 2021-01-24T04:37:28+05:30 IST

ఆ ఇద్దరు మంచి స్నేహితులు. టిక్‌టాక్‌ వీడియోలు..

టిక్‌టాక్ వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపే స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు.. చివరికి..
రఫీ (ఫైల్‌)

స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు!

గొడవకు దారి తీసిన అమ్మాయి వ్యవహారం

యువకుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు

ఏం చేయాలో దిక్కుతోచక యువకుడి ఆత్మహత్య 


నెల్లూరు: ఆ ఇద్దరు మంచి స్నేహితులు. టిక్‌టాక్‌ వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపేవారు. అలాంటి వారి మధ్య ఓ యువతితో వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య దాడికి దారి తీసింది. చివరికి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయులపేట పెద్దతోట ప్రాంతంలో రియాజ్‌ బాషా చిన్న కుమారుడు రఫీ (23) ఈవెంట్స్‌కు ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. నారాయణరెడ్డి ప్రాంతానికి చెందిన ముస్తఫా, రఫీ ఇద్దరూ స్నేహితులు. ఓ యువతితో ముస్తఫా ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇది రఫీకి కూడా తెలుసు.


అయితే, సదరు యువతి రఫీతో కూడా చనువుగా ఉండటంతో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం ఏర్పడింది. ఈ నెల 20న  రఫీ, యువతి కలిసి టీ తాగేందుకు మనుబోలుకు వెళ్లారు. ఇది తెలుసుకున్న ముస్తఫా సదరు యువతికి ఫోన్‌ చేసి ఎక్కడున్నావంటూ వాకాబు చేశాడు. రఫీతో కలిసి మనుబోలులో ఉన్నట్టు చెప్పడంతో ఇద్దరూ నాల్గవ మైలు దగ్గరకు రావాలని చెప్పాడు. ఈవెంట్‌ నగదు ఇస్తాడన్న నమ్మకంతో రఫీ, యువతిని వెంటబెట్టుకుని నాల్గవ మైలులోని అపార్టుమెంట్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ముస్తఫా వెంటనే రఫీపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన రఫీని తండ్రి రియాజ్‌ ఆసుపత్రిలో చేర్పించాడు. జరిగిన విషయం తెలుసుకుని ఈ నెల 21వ తేదీన నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ముస్తఫాపై ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు.


చంపేస్తానని బెదిరింపులు

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని రఫీపై ముస్తఫా బెదిరించసాగాడు. రఫీకి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించసాగాడు. దీంతో ఈ నెల 22వ తేది రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని రఫీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు రఫీని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌బాషా రఫీ మృతదేహాన్ని పరిశీలించి శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-24T04:37:28+05:30 IST