నెల్లూరులో దారుణ ఘటన...

Sep 15 2021 @ 12:36PM

నెల్లూరు: నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. శారీరక వాంఛ తీర్చాలని, వేరొక వ్యక్తితో వ్యభిచారం చేయమని బెదిరిస్తూ ఓ వ్యక్తి యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతిని చేతులు, కర్రలతో విచక్షణా రహితంగా కొడుతూ.. వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందాడు. యువతి ఎంత బ్రతిమిలాడినా మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. నెల్లూరు రూరల్ పరిధి, రామకోటినగర్‌లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ వీడియో చూసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ యువతి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే వీడియో చూసి విచారణ చేపట్టారు.


నెల్లూరు రూరల్ పరిధిలో రాంకోటినగర్, అంబాపురం, కొత్తూరు, వైఎస్సార్ నగర్ ప్రాంతాల్లో రౌడీ మూకల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రౌడీయీజాన్ని కూకటివేళ్లతో పెకిలించేస్తామని ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి చెప్పారు. అయినా రౌడీల ఆగడాలు ఆగలేదు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంవల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటన నెల్లూరు వ్యాప్తంగా కలకలంరేపుతోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.