cricketer: అత్యాచారం కేసులో క్రికెటర్ లామిచానేపై పోలీసు విచారణ

ABN , First Publish Date - 2022-10-06T17:27:13+05:30 IST

పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన నేపాల్ క్రికెటర్(Nepal cricketer) సందీప్ లామిచానేను( Sandeep Lamichhane) ఖాట్మండు పోలీసులు...

cricketer: అత్యాచారం కేసులో క్రికెటర్ లామిచానేపై పోలీసు విచారణ

ఖాట్మండు(నేపాల్): పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన నేపాల్ క్రికెటర్(Nepal cricketer) సందీప్ లామిచానేను( Sandeep Lamichhane) ఖాట్మండు పోలీసులు గురువారం విచారిస్తున్నారు. నేపాల్ మాజీ క్రికెట్ కెప్టెన్ అయిన సందీప్ లామిచానే గురువారం ఉదయం ఖాట్మండులోని  త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు.‘‘నా నిజాయితీ ప్రకారం ఖతార్ ఎయిర్‌వేస్ నుంచి ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతున్నాను’’ అని మాజీ క్రికెటర్ లామిచానే గురువారం ఉదయం ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ‘‘ఈ కేసులో నాకు న్యాయం జరుగుతుందని, నా  దేశానికి  కీర్తిని తీసుకురావడానికి త్వరలో క్రికెట్ మైదానానికి తిరిగి వస్తానని ఖచ్చితంగా అనుకుంటున్నాను, దీనిపై త్వరగా విచారణ జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. దర్యాప్తునకు  నేను పూర్తిగా సహకరిస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను’’ అని లామిచానే చెప్పారు.


ఆగస్ట్ 21వతేదీన లామిచానే తనను తీసుకెళ్లి ఖాట్మండులోని సినమంగల్‌లోని ఓ హోటల్‌కు తీసుకొచ్చాడని, అదే రాత్రి తనపై అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక కేసు పెట్టింది.అతనిపై కేసు నమోదైనప్పటి నుండి అతను ఎక్కడున్నాడో తెలియక పరారీలో ఉన్నాడు. దీంతో ఇంటర్‌పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) నుంచి ఇప్పటికే డిఫ్యూజన్ నోటీసు జారీ చేశారు.నేపాల్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు లామిచానేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.లామిచానేను అదుపులోకి తీసుకొని ( custody) విచారిస్తామని ఖాట్మండులోని జిల్లా పోలీసు రేంజ్‌లోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భరత్ బహదూర్ బోహరా చెప్పారు.

Updated Date - 2022-10-06T17:27:13+05:30 IST