ప్రతికూల వాతావరణం కారణంగానే Nepal plane కూలింది

ABN , First Publish Date - 2022-05-31T17:47:31+05:30 IST

ప్రతికూల వాతావరణం కారణంగానే నేపాల్ విమానం(Nepal plane) కూలిపోయిందని పౌర విమానయాన అథారిటీ ప్రాథమిక విచారణలో తేలింది...

ప్రతికూల వాతావరణం కారణంగానే Nepal plane కూలింది

సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రాథమిక విచారణలో వెల్లడి

కాఠ్మాండూ: ప్రతికూల వాతావరణం కారణంగానే నేపాల్ విమానం(Nepal plane) కూలిపోయిందని పౌర విమానయాన అథారిటీ ప్రాథమిక విచారణలో తేలింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఎడమవైపుకు తిరగకుండా, కుడివైపునకు మళ్లిన తర్వాత పర్వతాలపై కూలిపోయిందని సీఏఏఎన్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. నలుగురు భారతీయులు సహా 22 మందితో ఆదివారం నేపాల్‌లోని పర్వత ప్రాంతాల ముస్తాంగ్ జిల్లాలో తారా ఎయిర్ విమానం కూలిపోవడానికి ప్రతికూల వాతావరణమే కారణమని తమ దర్యాప్తులో తేలిందని డీజీ వివరించారు.



తారా ఎయిర్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం సీనియర్ ఏరోనాటికల్ ఇంజనీర్ రతీష్ చంద్ర లాల్ సుమన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.కూలిపోయిన విమాన శకలాల నుంచి ఇప్పటి వరకు 21 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు.ఈ విమానాన్ని మొదటిసారిగా 1979లో ఎయిర్ బోట్స్‌వానా కొనుగోలు చేసింది. 

Updated Date - 2022-05-31T17:47:31+05:30 IST