నేపాల్ ప్రధానిని బహిష్కరించిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ

ABN , First Publish Date - 2021-01-25T03:30:11+05:30 IST

నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలిని అధికార కమ్యూనిస్ట్ పార్టీ తొలగించింది. పార్టీలోని చీలిక

నేపాల్ ప్రధానిని బహిష్కరించిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ

కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలిని అధికార కమ్యూనిస్ట్ పార్టీ తొలగించింది. పార్టీలోని చీలిక వర్గం నేడు నిర్వహించిన కేంద్ర కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. ప్రధాని కేపీ శర్మ సభ్యత్వాన్ని ఉపసంహరించినట్టు చీలక వర్గ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. పార్లమెంటును రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని నిర్ణయంపై  పార్టీలోని వ్యతిరేకవర్గం గుర్రుగా ఉంది.  ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకుంది.


‘‘అధికార ఎన్‌సీపీ చైర్మన్ పదవి నుంచి ఓలిని తొలిగించాం. ఇప్పుడాయన కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు. కాబట్టి ఓలిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనను ఆదేశించాం. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు’’ అని ఎన్‌సీపీ ప్రత్యర్థి వర్గ నేత మాధవ్ కుమార్ నేపాల్ పేర్కొన్నారు. ప్రధాని తన తప్పును సరిదిద్దుకున్నప్పటికీ ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 


పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేపీ ఓలి వివాదాస్పద నిర్ణయం తర్వాత ఎన్‌సీపీ రెండుగా చీలిపోయింది. అనంతరం పార్టీపై హక్కు పూర్తిగా తమకే ఉంటుందని రెండు వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘సూర్యడు’ ఎవరికి లభిస్తోందనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Updated Date - 2021-01-25T03:30:11+05:30 IST