గోదావరి మాతకు హారతి ఇస్తున్న పండితులు
కొవ్వూరు, నవంబరు 29: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అఖండ గోదావరి మాతకు మహా నీరాజనం అందజేశారు. గోష్పాదక్షేత్ర గోదావరి నీరాజన సమితి అధ్యక్షుడు కలిగొట్ల కృష్ణారావు అధ్వర్యంలో ఆదివారం క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టంలోని గోదావరిమాత విగ్రహం వద్ద హారతి అందించారు. మహిళలు దీపోత్సవం నిర్వహించారు. ఇనుగంటి ఉమా రామారావు పాల్గొన్నారు.