వలస జీవులకు గూడు కరువు

ABN , First Publish Date - 2021-08-03T05:15:46+05:30 IST

వలస జీవులకు గూడు కరువు

వలస జీవులకు గూడు కరువు
యాద్గీర్‌ రోడ్డులో ఏర్పాటు చేసుకున్న గుడారాలు

కొడంగల్‌ రూరల్‌: కొడంగల్‌ ప్రాంతానికి 18సంవత్సరాల క్రితం వచ్చిన వలస జీవులకు గూడు కరువైంది. కర్నూల్‌ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం ప్లాస్టిక్‌ బిందెల వ్యాపారం చేస్తున్న వలస జీవులకు సొంత గూడు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ప్రభుత్వం నుంచి రేషన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డులు అందించినప్పటికీ ఉండేందుకు ఇళ్లు లేకపోవడంతో పట్టణ శివారులో గుడారాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం తమకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని వలస కుటుంబాలు కోరుతున్నాయి. 

Updated Date - 2021-08-03T05:15:46+05:30 IST