ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం

ABN , First Publish Date - 2022-01-25T04:37:07+05:30 IST

జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నగరంలోని డీకే ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం
మాట్లాడుతున్న డీవీఈవో

నెల్లూరు(విద్య), జనవరి 24 : జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నగరంలోని డీకే ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆదూరు శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. బాలికలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారన్నారు. విద్య, క్రీడా రంగాల్లో ప్రతిభ చూపుతూ ర్యాంకులు, పతకాలు సొంతం చేసుకుంటూ స్పూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా బాలికలను గౌరవించి వారి ఉన్నతికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైకే యూత్‌ ఆఫీసర్‌ ఎ.మహేంద్రరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ జి.కరుణకుమారి, కళాశాల సీనియర్‌ అధ్యాపకులు సీహెచ్‌.రవీంద్రనాధ్‌, అఽధ్యాపకులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో....

డీకే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికా హక్కులు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.గిరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలభవన్‌ డైరక్టర్‌ గోవిందరాజు సుభద్రాదేవి, ఎకనామిక్స్‌ అధ్యాపకులు డాక్టర్‌ చెంచురామయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ పి.ఉమామహేశ్వరి, అధ్యాపకులు డాక్టర్‌ కె.రమేష్‌, డాక్టర్‌ వై.దివ్య, పీఆర్‌ఓ కె.జోజి, సిబ్బంది పాల్గొన్నారు. 

కేఎఆన్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో.... 

బీవీనగర్‌లోని కేఎఆన్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ అసోసియేట్‌ ఆఫీసర్‌ గుండాల నరేంద్ర బాబు మాట్లాడుతూ 10 ఆంరఽధ నేవల్‌ యూనిట్‌ లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌, కమాండింగ్‌ ఆఫీసర్‌ వినయ్‌ రామచంద్రన్‌ ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపట్టామన్నారు. గర్ల్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సాయి శంకరి మాట్లాడుతూ 2008 నుంచి దేశంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎన్‌సీసీ కేడెట్లకు ఏ సర్టిఫికెట్‌ పరీక్షకు సంబంధించి డ్రిల్‌ పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షిఫ్‌ మోడలింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ రామన్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

పీఎంపీల ఆధ్వర్యంలో...

ది పీఎంపీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని దర్గామిట్ట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ మహిళా పోలీస్‌ షేక్‌.షాహీనా మాట్లాడుతూ ఉజ్వల భవితకు బాలికా సాధికారిత సాధించాలన్నారు. అనంతరం పలువురు వక్తలు బాలికల హక్కులు, సాధించిన విజయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్‌, మహిళా సంరక్షణ కార్యదర్శి పి.వరలక్ష్మి, రూడ్స్‌ అధ్యక్షుడు షేక్‌.రసూల్‌, పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీ ప్రసన్న, పీఎంపీ జిల్లా నాయకులు జి.శేషయ్య, డి.శ్రీనివాసులు, వి.రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:37:07+05:30 IST