జోహార్‌ నేతాజీ

ABN , First Publish Date - 2021-01-24T04:39:19+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దేశానికి అనితర సాధ్యమైన సేవలు చేశారు. ఆయన చూపిన బాటలో నడవాలని వక్తలు అన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని బోస్‌ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు.

జోహార్‌ నేతాజీ
సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సింగరేణి డైరెక్టర్‌ బలరాం నాయక్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు రంగా కిరణ్‌

దేశానికి అనితర సాధ్యమైన సేవలు చేశారు

ఆయన బాటలో యువత నడవాలి

సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకల్లో వక్తలు

నెట్‌వర్క్‌: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దేశానికి అనితర సాధ్యమైన సేవలు చేశారు. ఆయన చూపిన బాటలో నడవాలని వక్తలు అన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని బోస్‌ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలు పోస్టాఫీస్‌ సెంటర్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలరీస్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) బలరామ్‌ నాయక్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీ. రంగా కిరణ్‌ పాల్గొని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముందుగా భరతమాత చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బలరాం నాయక్‌ మాట్లాడుతూ... భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీ. రంగా కిరణ్‌ మాట్లాడుతూ... జయంతి తప్ప వర్ధంతి లేని అమరుడని, స్వాతంత్య్రం అంటే అడిగి తీసుకునే భిక్ష కాదని పోరాడి సాధించుకునేదని చేతల్లో చూపారన్నారు. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి... నేను మీకు స్వేచ్ఛనిస్తానని’ ఆయన అన్న మాటల ద్వారా దేశవ్యాప్తంగా వేలమంది బ్రిటీషు సైనికులకు వ్యతిరేకంగా భారత సైన్యంగా మారారన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు రామచంద్రరావు, పిల్లి రాజేశ్వరరావు, వెంకటరెడ్డి, నరహరి, శర్మ, నాగభూషణం, బీజేపీ నాయకులు చింతలచెరువు శ్రీనివాసరావు, జల్లారపు శ్రీనివాస్‌, కూరపాటి రవీందర్‌, గుమలాపురం సత్యనారాయణ, చిలక రవి, మధు, పిడుగు శ్రీను పాల్గొన్నారు.

కొత్తగూడెం పోస్టాఫీస్‌సెంటర్‌లో నేతాజీ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్‌ మండె వీరహన్మంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్‌ బత్తుల వీరయ్య, కొత్తగూడెం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, ఎంపీపీలు బాదావత్‌ శాంతి, భూక్యా విజయలక్ష్మీ, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామోదర్‌, దిశ కమిటీ సభ్యులు గిడ్ల పరంజ్యోతిరావు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ కూచిపూడి జగన్‌, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు భాగం మోహన్‌రావు, ఎంఏ. రజాక్‌, ఆళ్ల మురళీ, మండల అధ్యక్షుడు కోటి వెంకటేశ్వర్లు, లింగం పిచ్చిరెడ్డి, ఉమర్‌, అన్వర్‌పాషా పాల్గొన్నారు. 

పాల్వంచ నటరాజ్‌ సెంటర్‌లోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కిలారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిలారు మాట్లాడుతూ.... సుభాష్‌ చంద్రబోస్‌ భారత దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, కనగాల బాలకృష్ణ, కనగాల నారాయణ, లింగమనేని సురేష్‌, కే. నాగమల్లేశ్వరరావు, బండి అంజయ్య, వీరారెడ్డి, ఎన్‌. సైదులు, పి. వెంకటేశ్వరరావు, వీరభద్రం, రవి, రిక్షా సత్యం, యాకుబ్‌, ఇస్మాయిల్‌, కే. రాము, మురళీ, శ్రీను పాల్గొన్నారు.

నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘం కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సభ్యులు రషీద్‌, వి. కొండలరావు, భిక్షం, రవిగౌడ్‌, ఉబ్బన శ్రీను, ప్రభుత్వ వైద్యులు రాఘవరెడ్డి, నామా బుచ్చయ్య పాల్గొన్నారు.

ఇల్లెందులో కూరగాయలమార్కెట్‌లో గల నేతాజీ విగ్రహనికి కూరగాయల మార్కెట్‌ వ్యాపారుల కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కూరగాయల వ్యాపారి ఎస్‌కె జానీ, అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌కె గౌస్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ప్రిన్సిపాల్‌ పోలవరపు పద్మ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా గ్రంధాలయసంస్ధ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ మాట్లాడుతూ దేశాన్ని బ్రిటిష్‌ పాలకులనుండి విముక్తి చేసేందుకు ప్రత్యేకంగా ఆర్మీని ఏర్పాటు చేసి పోరాటం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, నాగేంధ్రబాబు పాల్గొన్నారు. 

బూర్గంపాడులోని జక్కం పెద్ద బుచ్చయ్య మొమోరియల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అథ్యాపకులు వెంకటేశ్వరావు, నాగేశ్వరరావు, సత్యేంద్రకుమార్‌, శ్రీనివాస్‌, ముకుందం, గోరిమా, మున్నీ, హుస్సేన్‌ పాల్గొన్నారు.

నేతాజీ ఆశయాలు నేటికి ఆదర్శమని భద్రాచలం ఎఎ్‌సపీ డాక్టర్‌ వినీత్‌ పేర్కొన్నారు. నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలం తాతగుడి సెంటర్‌లో శనివారం నిర్వహించిన నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ జయంతి కార్యక్రమంలో ఏఎస్పీ పాల్గొని మాట్లాడారు.  కార్యక్రమంలో కంచర్ల గోపన్న సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దగ్గుబాటి విజయగోపాల్‌, బాదం జగదీష్‌, చారుగుళ్ల వెంకట్‌, రామారావు, బచ్చు ప్రసాద్‌, బుల్లిస్వామి, సుబ్బారావు, బోనాల ప్రసాద్‌, రామకృష్ణ, వీవీఎ్‌సటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అశ్వారావుపేట మండల పరిధిలోని కావిగుండ్ల పాఠశాలలో సుబాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడకలు శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో హెచ్‌ ఎం శోభన్‌, ఉపాధ్యాయులు మధు, సునీత, రాంబాబు, సురేష్‌, జీవి, అరుణ, భాస్కర్‌ పాల్గొన్నారు. 

జయంతే కాని వర్ధంతిలేని మహనీయుడు సుభాస్‌ చంద్రబోస్‌ అని అకిట్స్‌ డైరెక్టర్‌ జి. నర్సింహారావు అన్నారు. శనివారం స్దానిక వేపలగడ్డలోని అబ్దుల్‌కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వి.సీతారాంప్రసాద్‌, డీన్‌ అకడమిక్స్‌ పీఎస్‌ రాజేష్‌, హెచ్‌వోడీలు సాండశివరావు, మునీర్‌, ప్రతాప్‌, కృష్ణమోహన్‌, ఉపేందర్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T04:39:19+05:30 IST