నేతాజీ అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2021-01-24T05:48:55+05:30 IST

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ అడుగు జాడల్లో నేటి యువత నడవాలని ఎంపీ సోయం బాపురావ్‌ పిలుపు నిచ్చారు. శనివారం సుభా్‌షచంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో నేతాజీ చౌక్‌లో గల సుభా్‌షచంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నేతాజీ అడుగుజాడల్లో నడవాలి
ఆదిలాబాద్‌లో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పిస్తున్న ఎంపీ

ఎంపీ సోయం బాపురావ్‌ 

జిల్లాలో ఘనంగా సుభాష్‌చంద్రబోస్‌ జయంతి ఉత్సవాలు 

నివాళ్లర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

ఆదిలాబాద్‌ అర్బన్‌, జనవరి 23: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ అడుగు జాడల్లో నేటి యువత నడవాలని ఎంపీ సోయం బాపురావ్‌ పిలుపు నిచ్చారు. శనివారం సుభా్‌షచంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో నేతాజీ చౌక్‌లో గల సుభా్‌షచంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో బీజేపీ జిల్లా అధ్యక్షుడుపాయల శంకర్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు. అలాగే, నేతాజీని ఆదర్శం గా తీసుకొని దేశ భక్తిని చాటాలని ఏబీవీపీ పూర్వ విద్యార్థి నాయకులు బాలూరిగోవర్ధన్‌రెడ్డి అన్నారు. సుభా్‌షచంద్రబోస్‌ జయంతి  సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే, జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం పరాక్రమ దివా్‌స, నేతాజీ జయంతి సందర్భంగా ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌, స్వేరోజ్‌ ఆధ్వర్యంలో శనివారం 2కే రన్‌ నిర్వహించారు. ఇందులో ఫిట్‌ ఇండియా పౌండేషన్‌ జిల్లా అధ్యక్షుడు కూర పొచ్చన్న, ప్రధాన కార్యదర్శి మోరే వెంకటి, స్వేరోజ్‌ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, స్వేరోజ్‌ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అలాగే, ఆదిలాబాద్‌లో నేతాజీ జయంతిని స్థానిక బ్లూ భీం యూత్‌ సభ్యులు నిర్వహించారు. ఇందులో యూత్‌ అధ్యక్షుడు గొంటిముక్కుల ప్రేమేందర్‌, ప్రశాంత్‌, గంగన్న, ద్రికాంత్‌, సంజీవ్‌, శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే, జిలా ్లకేంద్రంలోని న్యూహౌజింగ్‌ బోర్డు కాలనీలో గల సత్యసాయి పాఠశాలలో నేతాజీ జయంతి నిర్వహించారు. ఇందులో భాగంగా తత్వమసి పిట్‌నెస్‌ క్లబ్‌ ఆధ్వర్యం లో ఆర్మీ జవాన్‌ రవి భార్య స్వప్నకు విజయ్‌కుమార్‌ రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కౌన్సిలర్‌ పవన్‌నాయక్‌, డీఎస్పీ నర్సింహారెడ్డి ఉన్నారు.

ఉట్నూర్‌ రూరల్‌: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో దేశభక్తి దినోత్స వం పురస్కరించుకొని పోరాట వీరుడు సుభా్‌షచంద్రబోస్‌ జయంతిని శనివారం  ఘనంగా నిర్వహించారు. దేశానికి చంద్రబోస్‌ చేసిన సేవలు, హిందుఫౌజ్‌ స్థాపన, జై హింద్‌ నినాధం గురించి వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కేవి కేశవులు, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ చేరాల లక్ష్మణ్‌, అధ్యాపకులు మంజుల, శ్రీనివాస్‌, సువర్ణ, శ్రీలత, వినోద్‌, గణేష్‌, సుజాత, దినే్‌షరెడ్డి, సాంబరాజు, సాయికృష్ణలు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఎన్‌ఎ్‌సయూఐ మండల అధ్యక్షుడు కళ్యాణ్‌రాథోడ్‌ ఆధ్వర్యంలో సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో విద్యాసంఘాల నాయకులు ప్రజ్ఞశీల్‌, జాదవ్‌ బాలరాజ్‌, అఖిల్‌, గిరిప్రసాద్‌, గోపిగౌడ్‌, దుర్వ శ్రీను, కుటికల సాయి, రాథోడ్‌ నవీన్‌, పర్శురాంలు పాల్గొన్నారు.

బోథ్‌: సుభా్‌షచంద్రబోస్‌ నేటి సమాజానికి ఆదర్శ ప్రాయుడని బీజేపీ నాయకులు గొర్ల రాజుయాదవ్‌ పేర్కొన్నాడు. శనివారం బోథ్‌లో సుభా్‌షచంద్రబోస్‌ జయంతి వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జె.వెంకటేశ్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు సోలంకి సాయికిరణ్‌, వార్డు సభ్యులు గిరీష్‌, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు బోజన్న పాల్గొన్నారు. 

నేరడిగొండ: నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ జయంతిని పురష్కరించుకుని శనివారం మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో జయంతి వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు, సుభాష్‌చంద్రబోస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఓబీసీ జిల్లా ఉపాద్యక్షు డు గట్టు నారాయణ మాటాడారు. ఇందులో పార్టీ మండల కార్యదర్శి ప్రశాంత్‌, జిల్లా అదికార ప్రతినిధి గంగారాం కుర్మే, నాయకులు తోడసం శంకర్‌, అనుపట్ల సంజీవ్‌, సాబ్లే సంతో్‌షసింగ్‌, రాజశేఖర్‌, తీగల నవీన్‌, భీంరావ్‌, చంపత్‌ ఉన్నారు.  

ఇచ్చోడ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీటీస నిమ్మల శివకుమార్‌రెడ్డి మాట్లడారు. అలాగే, విద్యానగర్‌ కాలనీలో నేతజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పిల్లి నరే్‌ష,శ్రీనివా్‌స,రవి,ప్రతా్‌ప,రాజు తదితరులు ఉన్నారు.

బేల: దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సుభా్‌షచంద్రబోస్‌ సేవలు దేశ యువతకు ఆదర్శం అని బేల జడ్పీటీసీ సభ్యురాలు అక్షిత సతీష్‌ పవార్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో చాంద్‌పల్లి గ్రామంలో సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడనేశ్వర పౌండేషన్‌ చైర్మన్‌ సతీ్‌షపవార్‌, స్థానిక సర్పంచ్‌ జంగ్‌షావ్‌, రాయిసెంటర్‌ అధ్యక్షులు కోరంగే దౌలత్‌రావ్‌, గ్రామ వీటీడీఏ చైర్మన్‌ జలపత్‌, కోరంగే సోనేరావు, వార్డు సభ్యులు సచిన్‌ ఉర్వతే, మాడవార్‌ హారీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి: బిటీష్‌ పాలన నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు నిర్వహించిన స్వాతంత్ర ఉద్యమంలో అలుపు ఎరుగని పోరాటం చేసిన నేతాజీ సుభాష్‌ చంద్రబోష్‌ జయంతిని బీజేపీ మహిళ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహానిరెడ్డి అన్నారు. శనివారం ముత్నూర్‌లోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబోస్‌ నేటి యువతకు ఆర్శంగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, వైస్‌ ఎంపీపీ పడ్వాల్‌ గోపాల్‌సింగ్‌, భీంరావు, సడ్వాల్‌ విజయ్‌సింగ్‌ , గేడాం మధుకర్‌ అర్కఖమ్ము, మరప రాజు, దీపక్‌సింగ్‌ షేకావత్‌, పోటే సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:48:55+05:30 IST