నేత్రపర్వంగా భావనారుషి కల్యాణం

ABN , First Publish Date - 2021-03-02T06:34:03+05:30 IST

మండలంలోని సీహెచ్‌ఎల్‌పురంలో సోమవారం భద్రావతి సమేత భావనారుషి స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.

నేత్రపర్వంగా భావనారుషి కల్యాణం
సీహెచ్‌ఎల్‌పురంలో కల్యాణం జరిపిస్తున్న దృశ్యం

నక్కపల్లి, మార్చి 1 : మండలంలోని సీహెచ్‌ఎల్‌పురంలో సోమవారం భద్రావతి సమేత భావనారుషి స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన గురుస్వామి ఆమంచి ఆంజనేయస్వామి ఈ వేడుకను జరిపించారు. భావనారుషి, భద్రావతి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. అనంతరం మహిళలు సారె ఊరేగింపు చేపట్టారు. గ్రామ మార్కండేయ సేవా సమితి, పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్ర మంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వైజాగ్‌ స్వీట్‌ గైస్‌ ఆధ్వ ర్యంలో అన్నసమ ఆరాధన నిర్వహించారు. ఇదిలావుంటే, నక్కపల్లిలో సోమవారం రాత్రి భద్రావతి సమేత భావనారుషి జాతర ఘనంగా జరిగింది.  గ్రామ పద్మశాలి సంక్షేమ సంఘం, భావనారుషి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సాయంత్రం వరకూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాసం వున్న భక్తులు పత్రిపూజ చేశారు. అనంతరం శూలాల ఊరేగింపు చేపట్టారు. 


Updated Date - 2021-03-02T06:34:03+05:30 IST