క్రికెట్‌కు రాస్ టేలర్ భావోద్వేగ వీడ్కోలు

ABN , First Publish Date - 2022-04-04T23:51:09+05:30 IST

న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ క్రికెట్‌కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. హమిల్టన్‌లోని

క్రికెట్‌కు రాస్ టేలర్ భావోద్వేగ వీడ్కోలు

హమిల్టన్: న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ క్రికెట్‌కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. హమిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేతో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించే జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముగ్గురు పిల్లలు మెకంజీ, జాండీ, అడిలైడ్‌తో కలిసి పాల్గొన్న 38 ఏళ్ల టేలర్.. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఈ కార్యక్రమం అనంతరం మార్టిన్ గప్టిల్ అతడిని ఓదార్చడం కనిపించింది. టేలర్ భార్య విక్టోరియా, ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

 

చివరి మ్యాచ్ ఆడేందుకు టేలర్ బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయిన టేలర్ 16 బంతులు ఆడి 14 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. టేలర్ న్యూజిలాండ్ తరపున మూడు ఫార్మాట్లలో కలిపి 15 వేలకుపైగా పరుగులు చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్‌కు రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, డేనియల్ వెటోరీ వంటి దిగ్గజ క్రికెటర్లు విషెస్ తెలిపారు. 



Updated Date - 2022-04-04T23:51:09+05:30 IST