ఎటు వెళ్లాలన్నా పడవపైనే..!

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

ఇక్కడ మార్కెట్‌కో, షాపింగ్‌కో వెళ్లాలంటే బైక్‌, లేదంటే కారు ఉపయోగిస్తారు. కానీ ఆ ఊర్లోని ప్రజలు మాత్రం ఎటు వెళ్లాలన్నా పడవలు తీస్తారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో తెలుసా?

ఎటు వెళ్లాలన్నా పడవపైనే..!

ఇక్కడ మార్కెట్‌కో, షాపింగ్‌కో వెళ్లాలంటే బైక్‌, లేదంటే కారు ఉపయోగిస్తారు. కానీ ఆ ఊర్లోని ప్రజలు మాత్రం ఎటు వెళ్లాలన్నా పడవలు తీస్తారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో తెలుసా?


  1. నెదర్లాండ్స్‌లోని ఒక చిన్న ఊరు గీథోర్న్‌. ప్రశాంతంగా, వాహనాల శబ్దానికి దూరంగా ఉంటుందీ గ్రామం.  2020 లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా 2795. ఇక అక్కడి ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఈ గ్రామానికి వెనిస్‌ ఆఫ్‌ ది నెదర్లాండ్స్‌ అని పేరు. 
  2. ఈ ఊరికి మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఊళ్లో అన్ని వైపులా కాలువలు ఉంటాయి. ఇక్కడ ఇంటికో టూ వీలర్‌ ఉన్నట్టుగా, అక్కడ ఇంటికో పడవ ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా పడవ బయటకు తీసి, కాలువలో ప్రయాణం చేస్తుంటారు. కెనాల్‌ ఒడ్డున సైకిల్‌  దారి మాత్రమే ఉంటుంది.
  3. పడవలు కూడా తక్కువ శబ్దంతో నడిచేవే ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలను సందర్శించడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST