నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T05:02:29+05:30 IST

నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి.

నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
విద్యుద్దీపాలతో కామిరెడ్డిపాడులోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం

ఆత్మకూరు, సెప్టెంబరు 25  : నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం, జ్వాలాముఖి, తిరునాళ్లతిప్పలోని శ్రీదుర్గామల్లేశ్వరి ఆలయం, శివాలయంలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు భువనేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శివాలయంలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో నవరాత్రుల్లో విశేష  అలంకరణలతో అమ్మవారు అలరిస్తారని పూజారి శివకుమార్‌శర్మ పేర్కొన్నారు.

అనంతసాగరం మండలంలోని కామిరెడ్డిపాడు గ్రామ సమీపంలో    ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త బుట్టి భారతి తెలిపారు. ప్రతి రోజు ప్రత్యేక పూజలు, హోమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశామన్నారు.  


 

ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలి

 జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌

ఆత్మకూరు, సెప్టెంబరు 25 : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే దిశగా పాలకులు, అధికారులు దృష్టి సారించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన ‘పవనన్న ప్రజాబాట’ కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లడుతూ మున్సిపాల్టీలో విలీనమైన నెల్లూరుపాళెం, వెంకట్రావుపల్లి, పేరారెడ్డిపల్లి, జాలయ్యనగరం, శాంతినగరం, నరసాపురం గ్రామాల్లో నేటికీ కనీస వసతులైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కొరవడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.   అధికారులు స్పందించి సదుపాయాలు కల్పించాలని కోరారు.  కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, సునీల్‌, నాగరాజు, భాను, హజరత్‌ తదితరులు పాల్గొన్నారు.


==========



Updated Date - 2022-09-26T05:02:29+05:30 IST