Viral Video: ఇంటి ఎదుట ఇద్దరు మహిళ మధ్య ఫైట్.. చెత్త విషయంలో మరీ ఇంత చెత్తగానా..

ABN , First Publish Date - 2022-07-17T22:28:23+05:30 IST

మహిళల(women) మధ్య తలెత్తే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. పల్లెల్లో రోజూ ఎక్కడో చోట ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో స్థానికులు ఎవరికీ..

Viral Video: ఇంటి ఎదుట ఇద్దరు మహిళ మధ్య ఫైట్.. చెత్త విషయంలో మరీ ఇంత చెత్తగానా..

మహిళల(women) మధ్య తలెత్తే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. పల్లెల్లో రోజూ ఎక్కడో చోట ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో స్థానికులు ఎవరికీ సర్దిచెప్పలేక... కొన్నిసార్లు అలాగే చూస్తుండిపోతుంటారు. పప్పు, ఉప్పు విషయంలో, చెత్తాచెదారం విషయంలో తలెత్తే గొవలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. ఇక పక్క పక్క ఉండే ఇళ్లల్లో ఉండే మహిళల గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే..


ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ వీడియో వైరల్ అవుతోంది. పక్క పక్కనే ఉన్న ఇళ్లల్లో ఉంటున్న మహిళ మధ్య చెత్తాచెదారం విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా.. చివరకు పోటాపోటీగా మారింది. ఓ మహిళ చెత్తనంతా ఊడ్చి.. మరో మహిళ ఇంటి ముందు వేస్తే.. మరోవైపు అటువైపు మహిళ కూడా మళ్లీ ఆ చెత్తనంతా ఊడ్చి ఇటువైపు వేసింది. ఇలా ఇద్దరూ పోటాపోటీగా చెత్తను ఊడ్చేచారు. మధ్యలో ఓ పెద్దావిడ ఇద్దరికీ సర్దిచెప్పాలని ప్రయత్నించినా ఫలించలేదు. చెత్తతో పని కాదు అనుకున్నారో ఏమో.. తర్వాత ఏకంగా మురుగు కాలువలోని బురదను చేతులతో ఎత్తుకుని పోటాపోటీగా ఒకరి ఇంట్లో ఇంకొకరు వెదజల్లుకున్నారు. చివరకు అటువైపు మహిళ.. కోపంతో ఇటువైపు ఇంట్లోని బాలుడి మీద కూడా బురదను చల్లేసింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు(Netizens) ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

తన భార్యకు health బాగోలేదంటూ బాలికను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన Manager.. బలవంతంగా యాసిడ్ పోసి మరీ..





Updated Date - 2022-07-17T22:28:23+05:30 IST