ఇలాంటి డ్రస్సులను ఎందుకు వేసుకుంటోంది.. Rashmika Mandanna పై నెటిజన్ల సెటైర్లు..!

Published: Fri, 27 May 2022 12:44:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇలాంటి డ్రస్సులను ఎందుకు వేసుకుంటోంది.. Rashmika Mandanna పై నెటిజన్ల సెటైర్లు..!

కన్నడ సినిమా ‘కిరాక్ పార్టీ’తో సినిమా ప్రపంచానికి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సాధించిన బ్యూటీ రష్మికా మందన్నా. అనంతరం నాగశౌర్య ‘ఛలో’తో తెలుగు అడుగు పెట్టిన ఈ భామ టాలీవుడ్‌లోనూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఇవే కాకుండా తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ అక్కడ కూడా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్, టాప్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప (Pushpa)’ సినిమాతో ఈ తార ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది.


రష్మిక అందం, నటనతోనే కాకుండా డ్రెస్సింగ్ సెన్స్‌తోనూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ముంబైలో బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) 50వ పుట్టినరోజు వేడుకకి హాజరైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై నడిచిన ఈ బ్యూటీ కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ మీడియాకి ఫొటోలకి స్టిల్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


అందులో.. రష్మిక బ్లాక్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించి అలరించింది. అయితే ఆ డ్రెస్ కింద భాగంలో చీలిక ఉండడం వల్ల ఈ భామ మీడియా ముందు నడవడానికి బాగా ఇబ్బందిపడింది. మాటిమాటికి డ్రెస్‌ని చేతితో పట్టుకుంటూ ఫొటోలు తీయొద్దని ఇబ్బందికరంగా నవ్వుతూ చెప్పింది.  దీంతో పలువురు నెటిజన్లు రష్మికపై సెటైర్లు వేయడం ప్రారంభించారు. ‘అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు ఆ డ్రెస్‌లో ధరించావు’, ‘ఇలాంటి డ్రెస్‌ని ఎందుకు వేసుకున్నావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు బ్యూటీఫుల్, గార్జియస్, స్టన్నింగ్ అంటూ ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...