ఒక్క మాటతో కంపెనీకి రూ.29 వేల కోట్ల నష్టం.. మరి అదే రోనాల్డో ఒకప్పుడు కోకాకోలా యాడ్‌లో ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2021-06-18T01:40:13+05:30 IST

ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులు అమితంగా ఇష్టపడే పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. మల్టీ నేషనల్ కంపెనీ కోకాకోలాకు తీరని నష్టాన్ని మిగిల్చిన వైనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఒక్క మాటతో కంపెనీకి రూ.29 వేల కోట్ల నష్టం.. మరి అదే రోనాల్డో ఒకప్పుడు కోకాకోలా యాడ్‌లో ఏమన్నాడంటే..

ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులు అమితంగా ఇష్టపడే పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. మల్టీ నేషనల్ కంపెనీ కోకాకోలాకు తీరని నష్టాన్ని మిగిల్చిన వైనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం యూరో కప్-2021లో పోర్చుగల్ జట్టును నడిపిస్తున్న ఈ దిగ్గజ ఆటగాడు.. ఆ కప్ అధికారిక స్పాన్సర్ కోకాకోలాకు రూ.29 వేల కోట్ల నష్టం కలిగించాడు. హంగేరీతో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో కోకాకోలా బాటిల్స్ తీసి పక్కన పెట్టి.. `నీళ్లు తాగండి` అంటూ రోనాల్డో సూచించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. రొనాల్డో దెబ్బకు స్టాక్ మార్కెట్‌లో కోకాకోలా షేర్లు 1.6 శాతం మేర నష్టపోయాయి. 242 బిలియన్ డాలర్ల కోకాకోలా మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా 238 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒకే రోజు దాదాపు రూ. 29 వేల కోట్ల రూపాయల విలువ ఆవిరై పోయింది. 


కోకాకోలా తాగొద్దంటూ ఇప్పుడు బహిరంగంగా చెప్పిన రొనాల్డో గతంలో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని కోకాకోలాను ప్రమోట్ చేశాడు. 2006లో జర్మనీలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా రూపొందించిన కోకాకోలా యాడ్‌లో రొనాల్డో నటించాడు. కోకాకోలా అభిమానులు ఆ యాడ్‌ను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 


`గతంలో కోకాకోలా తాగమని చెప్పిన రొనాల్డో ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడు?`, `ఒక అథ్లెట్ అయి ఉండి గతంలో కోకాకోలాను ఎందుకు ప్రమోట్ చేశాడు?`, `అతను ఆడతున్న టోర్నమెంట్‌కు డబ్బులు ఇస్తున్న సంస్థకు నష్టం చేకూర్చాలనుకుంటున్నాడా?` అంటూ విమర్శలు చేస్తున్నారు. వీటికి రొనాల్డో అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. 




Updated Date - 2021-06-18T01:40:13+05:30 IST