Russia-Ukraine crisis: ఈమె కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌లో మనోళ్లకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో..!

ABN , First Publish Date - 2022-03-02T20:21:36+05:30 IST

సంక్షోభంలో ఉన్న ప్రతీసారి.. గతంలో ఇలాంటి సంక్షోభ సమయాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తులను గుర్తుకు చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. తమ నిర్ణయాలతో, తెలివితో, తమకు ఉన్న అధికారాలతో వేలాది మందిని ఎలా కాపాడారు అన్న విషయాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటాయి.

Russia-Ukraine crisis: ఈమె కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌లో మనోళ్లకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో..!

సంక్షోభంలో ఉన్న ప్రతీసారి.. గతంలో ఇలాంటి సంక్షోభ సమయాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తులను గుర్తుకు చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. తమ నిర్ణయాలతో, తెలివితో, తమకు ఉన్న అధికారాలతో వేలాది మందిని ఎలా కాపాడారు అన్న విషయాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల గురించిన వార్తల్లో అంతర్జాతీయ మీడియా కూడా ఒకరి పేరును ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాయంటే.. ఆ వ్యక్తి ఘనత ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న ఆమెనే. ఇంతకీ ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా..?


అయితే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో చిన్నమ్మ సుష్మాజీ కనుక ఉండి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2015వ సంవత్సరంలో ఆపరేషన్ రాహత్ గురించి నెటిజన్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. సౌదీ అరేబియా, యెమన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో ఒక వైపు ఆయా దేశాలతో నేరుగా చర్చలు జరుపుతూనే ఏకంగా 4640 మంది భారతీయ పౌరులను, వారితోపాటు 41 దేశాలకు చెందిన 960 మంది విదేశీయులను కూడా సురక్షితంగా బయటకు రప్పించిన ఘనత సుష్మాస్వరాజ్ సొంతం. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు కష్టం వచ్చినా సుష్మాజీ అండగా ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో నరకం అనుభవించిన ప్రవాసులను కూడా రక్షించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. మా అబ్బాయి చదువుకునేందుకు వెళ్తే జైల్లో పెట్టారంటూ ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైనా సాయం కోసం అర్థిస్తే.. ఆయా దేశాలతో చర్చించి కడుపుకోతను తీర్చిన తల్లిగా అందరి మదిలో నిలిచిపోయిన సుష్మాజీ.. 2019వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున 67 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె లేని లోటు ప్రత్యక్షంగా కనిపిస్తోందని విదేశాల్లో ఉన్న భారతీయులు గుర్తు చేసుకుంటున్నారంటే.. సుష్మాజీ పనితీరు ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.  


1968వ సంవత్సరంలో ఎన్‌సీసీలో శిక్షణ సమయంలో తీసిన ఫొటో ఇది. ఆమె ఎవరో కాదు.. దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్. ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారానే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు. కష్టాల్లో ఉన్నామంటూ ఎవరు ఏ క్షణంలో ట్విటర్‌లో తనను ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టినా.. వెన్వెంటనే బదులిచ్చేవారు. వారి సమస్యను పరిష్కరించేవరకు అధికారులతో సంప్రదింపులు జరిపేవారు. తాజాగా ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయులు వేల సంఖ్యలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా భారత్‌కు రప్పించేందుకు మోదీ సర్కారు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లను చేసింది. ఏకంగా నలుగురు కేంద్రమంత్రులకు ఈ బాధ్యతలను మోదీ సర్కారు అప్పగించింది. వారంతా క్షణం తీరికలేకుండా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.

Updated Date - 2022-03-02T20:21:36+05:30 IST