ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు ఉల్లం‘ఘనులు’ చెప్పిన ఫన్నీ సాకులు ఇవీ..

ABN , First Publish Date - 2022-07-10T01:29:46+05:30 IST

సాధారణంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్ చేస్తారు. కానీ ఇప్పుడైతే.. ఆ ట్రాఫిక్‌లో వెయిట్ చేయలేకనో లేదా మరేదైనా కారణాల వల్లోగానీ నగరవాసుల ట్రాఫిక్ అతిక్రమణలు పెరిగిపోతున్నాయి.

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు ఉల్లం‘ఘనులు’ చెప్పిన ఫన్నీ సాకులు ఇవీ..

న్యూఢిల్లీ : సాధారణంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్ చేస్తారు. కానీ ఇప్పుడైతే.. ఆ ట్రాఫిక్‌లో వెయిట్ చేయలేకనో లేదా మరేదైనా కారణాల వల్లోగానీ నగరవాసుల ట్రాఫిక్ అతిక్రమణలు (traffic violations) పెరిగిపోతున్నాయి. చాలా సందర్భాల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు. రూల్స్ బ్రేక్‌ చేయడానికి రీజన్‌ ఏంటని పోలీసులు అడిగితే మాత్రం రకరకాల కారణాలు చెబుతున్నారు. అందులో కొందరి సాకులు.. ఓకే అనేలా ఉంటే.. మరి కొందరి రీజన్స్‌ మాత్రం క్రియేటివ్‌గా, ఇంకా ఫన్నీగా ఉంటాయి. 


ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్(Delhi Police department) ట్విట్టర్ హ్యాండిల్ ఇలాంటి ఎక్స్‌క్యూజ్‌ల(excuses) గురించే నెటిజన్లను(Netizens) అడిగింది. నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే మీరు చెప్పే సాకులు ఏంటని, మోస్ట్ ఫన్నీ ఎక్స్‌క్యూజ్‌లు ఏంటని ట్విట్టర్‌ వేదికగా ఢిల్లీ పోలీసులు అడిగారు. అయితే దొరికిందే టైం అన్నట్లుగా నెటిజన్లు తమదైన శైలీలో వారు చెప్పే సాకులు ఏంటో పంచుకున్నారు.


ఒక నెటిజన్ ‘‘ సార్‌ నా గర్ల్‌ఫ్రెండ్‌ నాకోసం వెయిట్‌ చేస్తోంది.. లేట్‌గా వెళ్తే బ్రేకప్‌ చెప్పేస్తుంది.. దయచేసి వెళ్లనివ్వండి సర్’’ అని చెప్పాడు. మరొకరు తన డ్రైవింగ్ లైసెన్స్‌ను కుక్క తిన్నదని చెప్పారు. ఇంకో యూజర్‌.. సీట్ బెల్ట్ ధరించలేను, గర్భంతో ఉన్నాను అని పేర్కొంది. మరో నెటిజన్.. హెల్మెట్ లేకుండా పట్టుబడినప్పుడు... తన తల్లికి అనారోగ్యంగా ఉంది.. అర్జెంట్‌గా మందులు కొనడానికి వెళుతున్నాను అని చెప్పి తప్పించుకున్నట్లు చెప్పాడు. ఇంకో నెటిజన్ తాను పట్టుబడ్డ ప్రతీసారి సర్ ఇది నా మొదటిసారి.. మళ్లీ ఇలా జరగదు.. దయచేసి వదిలెయ్యండి అని చెప్పినట్లు ట్వీట్‌ చేశాడు. అయితే వీళ్ల సాకులు విన్న పోలీసులు.. ఎక్కువ శాతం వారు చెప్పేవాటిని నమ్మి.. వారికి జరిమానా విధించకుండా జాగ్రత్తగా పో, బాబూ అని పంపించారట. కాగా... నెటిజన్లు చెప్పిన సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి.

Updated Date - 2022-07-10T01:29:46+05:30 IST