‘ఏ దేశపు మహారాణి’ అంటూ Nora Fatehiని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Published: Tue, 05 Jul 2022 19:43:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏ దేశపు మహారాణి అంటూ Nora Fatehiని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటతో అభిమానులను అలరించిన అందాల భామ నోరా ఫతేహీ (Nora Fatehi). అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనస్సును దోచుకుంది. తాజాగా నెటిజన్స్ ట్రోల్ బారిన ఆమె పడింది. అందుకు కారణమేంటంటే..


నోరా ఫతేహీ ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరిస్తుంది. ‘డ్యాన్స్ దీవానే జూనియర్స్’ (Dance Deewane Juniors) షోకు నీతూ కపూర్‌ (Neetu Kapoor) తో కలసి కో జడ్జీగా చేస్తోంది. ఈ షోలో పాల్గొనడానికి ఆమె చీరతో వచ్చింది. ఆ సమయంలో అక్కడ వాన కురుస్తుంది. కారు దిగబోతుండగా నీటిలో శారీ తడిసిపోతుందని ఆమె భావించింది. అందువల్ల సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకుంది. ఆమె చీరను గార్డు పట్టుకోగా కార్‌వ్యాన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఆమె మహారాణి అయినప్పటికీ సెక్యూరిటీ గార్డు మీద కొంచెం కూడా దయలేదా. చీరను కాపాడుకోవడానికి అతడిని వర్షంలో తడిసేలా చేసింది’’ అని ఓ నెటిజన్ తెలిపారు. ‘‘ఒక గొడుగును కొనుగోలు చేయడానికి ఆమె దగ్గర డబ్బులు లేవా’’ అని మరో నెటిజన్ చెప్పారు. ‘‘ఆమె ఏ దేశపు మహారాణి’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ వెల్లడించారు. ఈ శతాబ్దంలో ఇటువంటి బానిసత్వాన్ని అంగీకరించలేమంటూ మరికొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నోరా ఫతేహీ ట్రోల్స్‌కు గురి కావడం ఇది మొదటిసారేం కాదు. గతంలోను నెటిజన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. మలైకా అరోరా నుంచి ట్రైనింగ్ తీసుకుని ఈ విధంగా నడుస్తుందన్నారు. నోరా చివరగా ‘‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ (Bhuj: The Pride Of India)లో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...