Advertisement

69 ఏళ్ల వయసులో ఫోటోషూట్.. విరుచుకుపడుతున్న నెటిజన్లు

Jan 16 2021 @ 15:13PM

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోటో షూట్ లలో పాల్గొని గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. కానీ ఓ ఏడుపదుల వయసున్న బామ్మ ఫోటో షూట్ చేస్తే.. అందులోనూ జీన్స్, డెనిమ్, ఫ్లోరల్ మ్యాక్సీ ఫోటోలతో రెచ్చిపోతే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది..? మిగతా వారి విషయం తెలియదు కానీ.. మళయాళ నటి రజినీ చాందీకి మాత్రం ఇదే చేదు జ్ఞాపకంగా మారింది. 69 ఏళ్ల వయసులో ఆమె చేసిన ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒరు ముతస్సి గాథ అనే సినిమాలో బామ్మ పాత్ర ద్వారా రజినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ ఫేమ్‌తోనే మళయాల బిగ్‌బాస్‌ సీజన్-2లోనూ పాల్గొన్నారు. అయితే లాక్‌డౌన్ తరువాత క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఓ ఫోటోషూట్‌లో పాల్గొని, ఆ ఫోటోలను ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి.

 

సినిమాల్లోనే కాదు, బయట కూడా రజినీ చాందీ చక్కటి చీరకట్టులో, సంప్రదాయ వస్త్రధారణలోనే ఇప్పటివరకు చూసిన ప్రేక్షకులకు ఆమె ఫోటోలను చూసి మతి పోయినంత పనైంది. దీంతో కొందరు నెటిజన్లు రజినీ చాందీపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఈ వయస్సులో ఇదేం బుద్ధి.?’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు మరో అడుగు ముందుకేసి ‘మీరు ఇంకా చనిపోలేదా.?’ అంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ సానుకూలంగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ట్రోలింగ్‌పై రజినీ చాందీ స్పందిస్తూ.. తనకు నచ్చినట్లుగా ఉంటున్నానని, నచ్చిన పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. త్వరలో తనకు 70 సంవత్సరాలు నిండుతాయని. ముసలావిడ అందంగా కనిపిస్తే కొందరు అసూయ పడుతున్నారని అన్నారు. ఇలాంటి వ్యాపకాలు స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. అయితే ఆమె వివరణ ఇచ్చినా నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ ఆపడం లేదు. మరి ఇది ఎంతదూరం వెళుతుందో చూడాలి.

Follow Us on:
Advertisement