Viral Video: కూరలో కావాలనే ఉప్పు ఎక్కువగా కలిపి టేస్ట్ చూడమన్న భార్య.. ఆ భర్త రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా

ABN , First Publish Date - 2022-04-05T22:30:11+05:30 IST

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం మామూలే. కొన్నిసార్లు భర్తపై చూపించాల్సిన కోపాన్ని.. ఇంట్లోని వంట పాత్రలపై లేదంటే చిన్న పిల్లలపై చూపిస్తుంటారు...

Viral Video: కూరలో కావాలనే ఉప్పు ఎక్కువగా కలిపి టేస్ట్ చూడమన్న భార్య.. ఆ భర్త రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం మామూలే. కొన్నిసార్లు భర్తపై చూపించాల్సిన కోపాన్ని.. ఇంట్లోని వంట పాత్రలపై లేదంటే చిన్న పిల్లలపై చూపిస్తుంటారు. కొందరు మహిళలు అన్నం, కూరలు సక్రమంగా చేయకుండా తమ కోపాన్ని చూపిస్తుంటారు. చాలా మంది దంపతులు సరదా సరదాగా ఒకరిపై ఒకరు వింత వింత ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఇలాంటి వీడియోలకు కొదువే లేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ.. కూరలో ఉప్పు కలిపి భర్తకు తినిపిస్తుంది. కూర రుచి చూసి.. భర్త ఇచ్చిన రియాక్షన్ చూసి, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


@haappyyou అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. వంట గదిలో ఓ మహిళ కూర చేసి సిద్ధంగా ఉంచుతుంది. అయితే భర్తపై కోపమో, లేక సరదాగా ఆటపట్టించాలనో తెలీదు గానీ, ఓ స్పూన్‌తో కొంచెం ఉప్పు తీసుకుని.. అందులో కూర కలుపుతుంది. నేరుగా ఆ స్పూన్ తీసుకుని భర్త గదిలోకి వెళ్తుంది. ఒకసారి రుచి చూసి చెప్పు.. అంటూ భర్తకు తినిపిస్తుంది. కూర రుచి చూసిన భర్త.. ‘‘వావ్! చాలా అద్భుతంగా ఉందంటూ రియాక్షన్ ఇస్తాడు. అతడి మొఖంలో ఉప్పు తిన్న భావన ఏమాత్రం లేకపోవడాన్ని చూసి... అతడి భార్య అవాక్కవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘అతడికి కొవిడ్ సోకిందేమో.. అందుకే ఉప్పు తిన్నా ఏమీ తెలియట్లేదు’’ అని ఒకరు.. ‘‘కూరలో ఉప్పు వేసి ఉండకపోవచ్చు.. అందుకే ఉప్పు కలిపినా సందేహం రాలేదు’’.. అని మరొకరు స్పందిస్తున్నారు.

వధూవరులిద్దరికీ జ్యూస్‌ తాగించి.. ఎంత పని చేశారు.. తీరా చూస్తే..





Updated Date - 2022-04-05T22:30:11+05:30 IST