మిలియన్ మార్క్ టచ్ చేసిన 'నెట్రికన్' లిరికల్ సాంగ్..!

Jun 11 2021 @ 15:15PM

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్'. ఇందులో నయన్ అంధురాలిగా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి విడుదలయిన 'ఇదువం కదందు పోగుమ్‌' అంటూ సాగే ఈ పాట వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాటకి కార్తీక్‌ నేత సాహిత్యం అందించగా,  సిద్ శ్రీరామ్ ఆలపించారు. గిరీష్‌ గోపాలకృష్ణన్‌ సంగీతమందించారు. మెలోడియస్‌గా సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మిలింద్‌ రావ్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాను రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్‌ శివన్‌, థామస్ కిమ్, కె.ఎస్.మాయిల్వగనన్ నిర్మిస్తున్నారు. హర్రర్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'నెట్రికన్' ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.