నెట్టికంటికి గంధాలంకరణ

ABN , First Publish Date - 2022-05-23T07:31:14+05:30 IST

దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం కసాపురం దేవస్థానంలో నెట్టికంటి ఆంజనేయుడి మూల విరాట్టుకు గంధలేపనంతో అలంకారాలు చేశారు.

నెట్టికంటికి గంధాలంకరణ
గంధ లేపనాలతో నెట్టికంటి ఆంజనేయుడు

గుంతకల్లు, మే 22: దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం కసాపురం దేవస్థానంలో నెట్టికంటి ఆంజనేయుడి మూల విరాట్టుకు గంధలేపనంతో అలంకారాలు చేశారు. ఉత్సవాలలో రెండవ రోజున ఉదయం ఆలయంలో ఏర్పాటుచేసిన యాగ శాలలో వాస్తు, యోగిని, నవగ్రహ హోమం, సర్వతోభద్రమండల, ప్రధానదేవతారాధనలు, వాస్తు హోమం, సుందరకాండ పారాయణం, మన్యుసూక్త పారాయణం, శ్రీరామ ఆంజనేయ స్వామివారి మూల మంత్రానుష్టానం, నీరాజన మంత్ర పుష్పం, తీర్థగోష్టి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలలో ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన సుగుణమ్మ, అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. 



నెట్టికంటి సన్నిధిలో జిల్లా జడ్జి...

కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో జిల్లా జడ్డి జీ శ్రీనివాస్‌, గుత్తి ఏడీజే కబర్ది, సీనియర్‌ సివిల్‌ జడ్డి తేజోవతి, గుంతకల్లు జేఎ్‌ఫసీఎం కేవీ రామకృష్ణయ్య, స్పెషల్‌ జుడిషియల్‌ సెకెండ్‌ క్లాస్‌ మెజిసే్ట్రట్‌ ఆదిలింగయ్య ఆదివారం ఉదయం పూజలు చేశారు. ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు వారిచే అర్చనలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. న్యాయమూర్తులను ఈఓ శాలువాలతో ఘనంగా సత్కరించారు. 


Updated Date - 2022-05-23T07:31:14+05:30 IST