వాట్సాప్‌లో ఏజెన్సీ యువతకు వలపు వల

ABN , First Publish Date - 2022-04-24T03:56:20+05:30 IST

సాకేంతిక విప్లవం మనిషికి ఉపయోగపడటం కన్నా దురపయోగమే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా మొబైల్‌ విప్లవం తర్వాత సామాజికంగా ఎన్ని అపసవ్య ధోరణులు చోటు చేసుకుంటున్నాయో చెప్పేందుకు తాజాగా ఏజెన్సీలో పాకుతున్న అశ్లీల ఫోన్‌ కాల్స్‌ ఉదాంతాలే ఇందుకు చక్కటి తార్కాణం.

వాట్సాప్‌లో ఏజెన్సీ యువతకు వలపు వల

- కాల్‌ కాల్‌కు వెల

- న్యూడ్‌ ఫొటోలతో యువతకు గాలం 

- వీడియో కాల్‌తో రెచ్చగొట్టే దృశ్యాలు

- ఉన్నతాధికారుల డీపీ ఉపయోగించి డబ్బులు లాగే యత్నం

- ఏజెన్సీ గ్రామాలకు వ్యాపించిన అశ్లీలత

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

సాకేంతిక విప్లవం మనిషికి ఉపయోగపడటం కన్నా దురపయోగమే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా మొబైల్‌ విప్లవం తర్వాత సామాజికంగా ఎన్ని అపసవ్య ధోరణులు చోటు చేసుకుంటున్నాయో చెప్పేందుకు తాజాగా ఏజెన్సీలో పాకుతున్న అశ్లీల ఫోన్‌ కాల్స్‌ ఉదాంతాలే ఇందుకు చక్కటి తార్కాణం. నిన్న మొన్నటి దాక బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఏజెన్సీలో మొబైల్‌ నెట్‌వర్క్‌ రంగప్రవేశ చేయడంతో ఇంటర్నెట్‌ ఆధారిత ఆశ్లీలత భారీగానే విస్తరి స్తోంది. కొంతకాలంగా ఏజెన్సీలోని పలు మండలాల్లో వాట్సాప్‌ మాద్యమంగా గుర్తుతెలియని ప్రాంతం నుంచి మహిళల పేరుతో న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారు. ముఖ్యంగా 20నుంచి 35ఏళ్ల మధ్య యువతను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్‌ నంబర్లకు ముందుగా సంక్షిప్త సందేశాలను పంపించి ముగ్గులోకి లాగుతున్నారు. ఆకర్షణీయమైన మహిళల పేర్లతో నగ్నదేహా లతో వాట్సాప్‌ డీపీలను పెట్టి రెచ్చగొట్టే సందేశాలను పంపిస్తున్నారు. ఇలా యువకుల్లో ఆసక్తిని రేకెత్తించి ఫోన్‌ కాల్‌ చేసేట్టు ఉసిగొలుపుతున్నారు. అలా వారి ట్రాక్‌లో పడిన యువకులకు తమ గుగూల్‌పే, ఫోన్‌ పే నంబర్లను ఇచ్చి నగ్నదేహాలను చూపిస్తున్నారు. ఒక్కో అంగానికి ఒక్కో రేటు కడుతున్నారు. అలాగే ఇంత సమయానికి ఇంత అని యువకుల మానసికస్థితిని బట్టి పెద్దమొత్తంలో డబ్బులను గుంజుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆసిఫాబాద్‌ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకునే ఓ యువకుడికి ఇదే తరహాలో వాట్సాప్‌లో మెసేజ్‌ రాగా ఆసక్తి కొద్ది కాల్‌బ్యాక్‌ చేశాడు. వెంటనే ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపించేందుకు డబ్బులు కావాలని ఇందుకు గుగూల్‌ పే చేయాలని కోరారు. సదరు యువకుడు పంపించటంతో పది సెకండ్ల పాటు వీడియో చూపించారు. వీడియో కాల్స్‌ రికార్డు చేసి యువకుడి చిత్రాలను స్ర్కీన్‌షాట్‌ తీశారు. వాటిని అతని స్నేహితులకు పంపిస్తామని చెప్పి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి భారీగా డబ్బులు డిమాండు చేసినట్టు తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈతరహాలో ఏజెన్సీ ప్రాంతంలో భారీగానే ఉన్నా యంటున్నారు. 

కలెక్టర్‌ డిస్‌ప్లేతో మరో రకం మోసం..

సైబర్‌ మోసాల్లో కాకలు తీరిన మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. ఏకంగా కలెక్టర్‌ స్థాయి ఉన్నతాధికారుల చిత్రాలను వాట్సాప్‌ డిస్‌ప్లే(డీపీ)గా పెట్టుకొని ఆయా జిల్లాల్లో పనిచేసే సబ్‌ ఆర్డినేట్స్‌కు సంక్షిప్త సందేశాలు పంపించి డబ్బులు డిమాండు చేస్తున్న సంఘటన ఒకటి శుక్రవారం ఆసిఫాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేరుతో ఆయన డిపీ ఉపయోగించి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు సందేశాలను పంపించారు. తాను కీలకమైన సమావేశంలో ఉన్నానని, ఎక్కువగా మాట్లాడనని అత్యసరంగా డబ్బులు కావాలని చెప్పి డబ్బులు లాగే ప్రయత్నం చేయడం కల కలం రేకేత్తించింది. ఈ సందేశం జిల్లాలోని పలువురు ఉన్న తాధికారులకు రావడంతో ఎప్పుడూ లేనిది ఇలా రావడం ఎంటనీ అనుమానం వచ్చిన సదరు ఉద్యోగులు ఒకరినొకరు ఈ సందేశాల్ని పంచుకోవడంతో ఇందులో ఏదో మతలబు ఉందని గమనించి కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో ఇది సైబర్‌ నేరగాళ్ల పని అని అర్థమైంది. ఈ సైబర్‌ నేరానికి పాల్పడిన దుండగుడికి నంబర్లతో పాటు ఉద్యోగుల పేర్లు ఎలా తెలిశాయన్నది విచారించాల్సిన అవసరం ఉంది. అదీ కాకుండా ఈ సందేశాలన్నీ కూడా వాట్సాప్‌ గ్రూపునకు సంబంధించిన నంబర్లకు మాత్రమే వచ్చినట్టు చెబుతు న్నారు. అటు అదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డీపీతో ఇదే తరహాలో సందేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఉద్యో గుల గ్రూపుల్లోనే టార్గెట్‌ చేయడాన్ని బట్టి సదరు నేరగాడు చాలాకాలంగా ఈ గ్రూపులను సన్నిహితంగా గమనిస్తున్నా డన్న విషయం తేటతెల్లమవుతోంది. సైబర్‌ క్రైం సెల్‌ దీన్ని కూపీలాగేందుకు రంగంలోకి దిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - 2022-04-24T03:56:20+05:30 IST