ఈ 9 మందితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోవ‌ద్దు.. కాదన్నారో తీవ్రంగా న‌ష్ట‌పోతారు.. వారెవ‌రో మీకు తెలుసా?

ABN , First Publish Date - 2021-11-13T11:57:53+05:30 IST

ప్రముఖ వ్యూహకర్త ఆచార్య చాణక్య తెలిపిన జీవన‌ విధానాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఆచార్య‌ చాణక్య మ‌న‌మంతా..

ఈ 9 మందితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోవ‌ద్దు.. కాదన్నారో తీవ్రంగా న‌ష్ట‌పోతారు.. వారెవ‌రో మీకు తెలుసా?

ప్రముఖ వ్యూహకర్త ఆచార్య చాణక్య తెలిపిన జీవన‌ విధానాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఆచార్య‌ చాణక్య మ‌న‌మంతా స‌మాజంలో మెల‌గాల్సిన ఉత్త‌మ‌ విధానాల‌ను రూపొందించారు. ఇందులో సమాజంలో క‌నిపించే ప్రతి అంశాన్ని లోతుగా చర్చించారు. చాణక్య తెలిపిన‌ ఈ విధానాలను ఎవరు అనుసరిస్తారో వారు జీవితంలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తార‌ని నిరూపిత‌మ‌య్యింది. ఆచార్య చాణక్య‌ తన నీతిశాస్త్రంలో మ‌న‌మంతా జీవితంలో అస్స‌లు శ‌త్రుత్వం పెట్టుకోకూడ‌ని తొమ్మిది మంది వ్యక్తుల గురించి వివ‌రంగా తెలిపారు. వీరితో పొర‌పాటున కూడా శత్రుత్వాన్ని పెట్టుకోకూడ‌ద‌ని ఆచార్య చాణ‌క్య హెచ్చ‌రించారు. వీరితో శ‌త్రుత్వం పెట్టుకుంటే జీవితంలో తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని చాణక్య తెలిపారు. మ‌రి వారెవ‌రో.. వారితో ఎందుకు శ‌త్రుత్వం పెట్టుకోకూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.


సన్నిహితులు: మీ రహస్యాలన్నీ తెలిసిన వ్యక్తిని మీరు ఎప్పుడూ ద్వేషించకూడదు. ఎందుకంటే మీరు అటువంటివారితో శత్రుత్వం పెంచుకుంటే, వారు మీ రహస్యాలను అంద‌రికీ వెల్లడిస్తారు.

ఆయుధాలు క‌లిగిన‌వారు : చేతుల్లో ఆయుధాలు క‌లిగిన‌వారిని ఎప్పుడూ విరోధించ‌కూడ‌దు. వారితో గొడవ పడకూడదు. ఎందుకంటే అలాంటివారు కోపగించిన‌పుడు వారి ద‌గ్గ‌రున్న ఆయుధాన్ని మీపై ఉప‌యోగించేందుకు అవ‌కాశ‌ముంటుంది.

య‌జ‌మాని: యజమానిపై ఎప్పుడూ అసూయపడకూడదు. వైరం పెట్టుకోకూడ‌దు. ఎందుకంటే వారు వారికున్న శ‌క్తియుక్తుల‌తో మీకు హాని త‌ల‌పెట్ట‌గ‌లుగుతారు.

వైద్యుడు:  వైద్యునితో ఏ వ్యక్తికీ శత్రుత్వం ఉండకూడదని చాణక్య తెలిపారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీకు నష్టం జరగవచ్చు.


ధనవంతుడు: ఆచార్య చాణక్యుని జీవ‌న విధానం ప్రకారం, క‌ల‌లో కూడా ధనవంతులతో గొడవ ప‌డ‌కూడ‌దు. ఎందుకంటే అలాంటి వ్యక్తి తన ప్రయోజనం కోసం ఏమైనా చేయ‌గలుగుతాడు. 

కవి: కవి లేదా రచయిత మొద‌లైన‌వారితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడ‌దు. ఎందుకంటే వీరు మీపై కోప‌గిస్తే మీ గురించి ఏమైనా రాసి, అంద‌రికీ తెలియ‌జేయ‌గ‌లుగుతారు.

వంటవాడు: వంట చేసే వ్యక్తితో శత్రుత్వం కలిగి ఉండకూడదని చాణక్య తెలిపారు. ఎందుకంటే అలాంటి వారు ఆహారంలో ఏదైనా క‌లిపి, హాని త‌ల‌పెట్టే అవ‌కాశ‌ముంటుంద‌ని చాణక్య హెచ్చ‌రించారు.

Updated Date - 2021-11-13T11:57:53+05:30 IST