చాణక్య నీతి: అలాంటి వ్యక్తుల మధ్య జీవితం నరకంతో సమానం!

Published: Mon, 28 Mar 2022 07:33:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చాణక్య నీతి: అలాంటి వ్యక్తుల మధ్య జీవితం నరకంతో సమానం!

ఒక వ్యక్తికి లభించే సంతోషం.. అతని చర్యలు, ప్రవర్తన, చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మత గ్రంథాలు మొదలుకొని, పండితుల వరకు అందరూ మనిషి సాంగత్యం బాగుండాలని సూచించారు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో దీని గురించి కూడా వివరించాడు. విజయం సాధించాలనుకుంటున్న వ్యక్తి కొందరి మధ్య ఉంటే నరకాన్ని చూడాల్సివస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. అతని లక్ష్యం కూడా కనుమరుగువుతుందని ఆచార్య చాణక్య పేర్కొన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

దుర్మార్గపు భార్య

భార్య సంస్కారవంతురాలు, గుణవంతురాలిగా ఉంటూ తెలివితేటలు కలిగినదైతే ఆమె తన భర్తకు అడుగడుగునా గొప్ప మద్దతుగా నిలుస్తుందని చాణక్య నీతి చెబుతోంది. దుష్ట గుణాలు కలిగిన భార్య కారణంగా ఎంతటి సమర్థుడైన భర్తకైనా జీవితం నరకప్రాయంగా మారుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే జీవిత భాగస్వామి చక్కని గుణాలతో ఉంటే భర్తతో పాటు కుటుంబం సంతోషంగా ఉంటుందని చాణక్య తెలిపారు. 

మూర్ఖుడైన శిష్యుడు

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం గొప్ప పండితునికి మూర్ఖుడైన శిష్యుడు దొరికితే ఆ గురువు జీవితం నరకప్రాయంగా మారుతుంది. నిజానికి గురువు.. తన శిష్యునికి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించాలని బోధిస్తాడు. అయితే శిష్యుడు మూర్ఖుడైతే ఎంతటి పాండిత్యం కలిగిన గురువైనా అతనికి ఏమీ బోధించలేడు. అలాంటి శిష్యుడిని కలిగిన గురువుకు సమాజంలో గౌరవం లభించదు.  

సంతోషంగా లేని వ్యక్తులు 

జీవితంలో విజయం సాధించిన వ్యక్తి సంతోషంగా లేని వ్యక్తుల మధ్య జీవితం గడపాల్సివస్తే అతని జీవితం నరకప్రాయం అవుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. ఇతరుల నిరాశాపూరిత ధోరణి అతనిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెడు ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. అందుకే విజయం సాధించాలనుకునేవారు అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.