చాణక్యనీతి: ఈ 3 విషయాలు గోప్యంగా ఉంచండి.. ఎవరికి చెప్పినా తీరని నష్టం!

ABN , First Publish Date - 2022-06-05T13:26:17+05:30 IST

ఆచార్య చాణక్యుడు తన విధానాలతో...

చాణక్యనీతి: ఈ 3 విషయాలు గోప్యంగా ఉంచండి.. ఎవరికి చెప్పినా తీరని నష్టం!

ఆచార్య చాణక్యుడు తన విధానాలతో చంద్రగుప్తుడిని అఖండ భారతదేశానికి చక్రవర్తిగా చేశాడు. నీతిశాస్త్రంలో మానవ సంక్షేమం కోసం ఆచార్య చాణక్య అనేక విషయాలు తెలియజేశాడు. మనిషి తన వ్యక్తిగతానికి సంబంధించిన మూడు విషయాలు ఎవరి ముందు వెల్లడించకూడదని ఆచార్య తెలిపారు. అప్పుడే అతను ఇబ్బందులు లేకుండా జీవించగలడని పేర్కొన్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

వైవాహిక జీవితం

భార్యాభర్తల మధ్య ఉండాల్సిన విషయాలు ఎవరికీ చెప్పకూడదు. ఎంతటి సన్నిహితులైనా ఇటువంటి విషయాలు రహస్యంగానే ఉంచాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే అది వైవాహిక జీవితంలో చిచ్చు రేపుతుంది. ఇతరులకు ఇటువంటి విషయాలు చెప్పడం వలన వైవాహిక జీవితం ఇతరుల ముందు అపహాస్యపాలు అవుతుంది. సమాజంలో దంపతుల గౌరవం మంటగలుస్తుంది.



ఆర్థిక నష్టం

చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం డబ్బు సంపాదన గురించి తెలియని వ్యక్తి దగ్గర మాట్లాడకూడదు. డబ్బు విషయంలో ఎవరినైనా నమ్మడం కష్టమే. జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు, అప్పుల పాలయినవారు ఈ విషయాలను తమకే పరిమితం చేసుకోవాలి. ఇటువంటి  విషయాలను ఇతరులకు చెబితే, అవతలివారు మిమ్మల్ని దూరం పెట్టేప్రయత్నం చేస్తారు. 

మోసపోయినప్పుడు

మీరు ఎక్కడైనా మోసపోయినట్లయితే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పండి. ఇలాంటి విషయాలు బయటివారికి చెబితే మీ సామర్థ్యాన్ని వారు శంకిస్తారు. మిమ్మల్ని తెలివి తక్కువవారిగా భావిస్తారు.

Updated Date - 2022-06-05T13:26:17+05:30 IST