ఈయేడూ.. పరీక్షలు రద్దు

ABN , First Publish Date - 2021-04-17T06:33:09+05:30 IST

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుది.. పదో తరగతితో పాటు ఇంటర్‌

ఈయేడూ.. పరీక్షలు రద్దు

పదితో పాటు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం 

టర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలూ డౌటే.. 

జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 23,039 మంది ఉండగా, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మొత్తం 18,675 మంది విద్యారులు

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 16: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుది.. పదో తరగతితో పాటు ఇంటర్‌ మొదటి సంవత్స రం పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దుచేసి విద్యార్థులకు ఎలాంటి పరిక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్‌ కానున్నారు. మే 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ ఇది వరకే షెడ్యూల్‌ ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్యా సీబీఎస్‌ఈ బోర్డు దేశవ్యాప్తంగా పరీక్షల ను రద్దుచేసిన నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 1నుంచి జరగాల్సిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరిక్షలను సైతం రద్దుచేసిన ప్రభుత్వం ద్వితీయ సంవత్సరం పరిక్షలను వాయిదా వేసింది. కాని కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృశ్యా ద్వితీయ సంవత్సరం పరిక్షలను కూడా నిర్వహించేది అనుమానంగానే ఉత 

గత సంవత్సరం విద్యార్థుల ప్రమోట్‌

జిల్లాలో పదవ తరగతి విద్యార్థులు 23వేల 39 మంది ఉండగా ఇందులో బాలురు 11వేల 841 మందికాగా బాలికలు 11వేల 198 మంది ఉన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు మొత్తం 37వేల 477 మంది ఉన్నారు. ఇందులో మొదటి సంవత్సరం రెగ్యూలర్‌ విద్యార్థులు 16462 మంది ఉండగా ఒకేషనల్‌ విద్యార్థులు 2213 మంది మొత్తం 18675 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రెగ్యూలర్‌ 16248 మంది ఉండగా ప్రైవేటు 585, ఒకేషనల్‌ 1969 మంది ఉన్నారు. గత యేడాది మార్చి 23వ తేది వరకు విద్యాసంవత్సరం కొనసాగగా ఆ తర్వాత కరోనా తీవ్రత పెరగడంతో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఎలాంటి పరిక్షలు రాయకుండానేసై తరగతులకు ప్రమోట్‌ చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం గత విద్యా సంవత్సరం పరిక్షలు నిర్వహించారు. గత యేడాది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల ఇంటర్నల్‌ మారర్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్‌ చేయగా ఈ విద్యాసంవత్సరం మాత్రం విద్యార్థులకు ఎలాంటి తరగతులు జరగలేదు. కేవలం 9,10 తరగతులు, ఇంటర్‌ విద్యార్థులకు మాత్రం ఫిబ్రవరి 1 నుంచి మార్చి 23 వరకు తరగతులు నిర్వహించారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నెలరోజుల పాటు మాత్రమే తరగతులు జరిగాయి. 

ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ప్రకారం మార్కులు

విద్యార్థుల ప్రవర్థన, క్రమశిక్షణ, హాజరు, ప్రాజెక్టు వర్క్‌, ఇతర సామార్థ్యాలను  పరిగణలోకి తీసుకుని ఆబ్జెక్టీవ్‌ క్రైటీరియా ప్రకారం విద్యార్థులకు మార్కులు  వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, పదవ తరగతి విద్యార్థులకు తరగతులు జరిగిన 45 రోజుల వ్యవధిలో ఒక ఫార్మాటీవ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ1) పరీక్ష మాత్రమే జరగగా ఆ పరిక్షల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే అవకాశాలు లేనందున ప్రభుత్వం ఆబ్జెక్టీవ్‌ క్రైటీరియా ప్రకారం మార్కులు వేయనున్నారు. అంతేకాకుండా ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు నష్టం జరగకుండా ఏయే  అంశాలను, విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటామో ఎస్‌ఎస్‌సీ బోర్డు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పాఠశాలల్లోను వవిద్యార్థులకు ఎలాంటి నష్టం లేకుండా మార్కులు వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రాబోయేపై చదువుల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండ విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి ఇంటర్నల్‌ మార్కులు వేయాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2021-04-17T06:33:09+05:30 IST