కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-27T05:14:23+05:30 IST

వ్యవసా య రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని రై తు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి
ధర్నా చేస్తున్న నాయకులు

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 26 : వ్యవసా య రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని రై తు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢి ల్లీలో రైతులు చేపట్టన ఉద్యమం 11 నెలలు పూ ర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్షణ కో ఆర్డినేషన్‌ కమి టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధ ర్నాకు చుండూరి రంగారావు అధ్యక్షత వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాల ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతియుతంగా ఆందోళన చే స్తున్న రైతులను కార్లతో తొక్కించిన ఆశీష్‌మిశ్రా తండ్రి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి వెంటనే తొల గించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చార్జీల పె ంపును ఉపసంహరించుకోవాలన్నారు. నాలుగు లేబర్‌ కోడ్లను ఉపసంహరించుకోవడంతో పాటు రైతులు పండించిన పంటలకు 50శాతం కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు వి.హనుమారెడ్డి, పమిడి వెంకట్రావు, పెంట్యాల హనుమంతరా వు, కంకణాల ఆంజనేయులు, చిట్టిపాటి వెంక టేశ్వర్లు, జి.శ్రీనివాసరావు, ఉప్పుటూరి ప్రకాశరా వు, బి.పద్మ, చుంచు శేషయ్య తదితరులు పా ల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:14:23+05:30 IST