‘నమ్మ కుడియిరుప్పు’ పేరుతో New App

ABN , First Publish Date - 2022-07-21T15:26:04+05:30 IST

తమిళనాడు నగర జీవన ప్రమాణాల మెరుగు అభివృద్ధి సంస్థకు చెందిన గృహ వినియోగదారులు చందా సులభంగా చెల్లించేందుకు వీలుగా రూపొందించిన ‘నమ్మ

‘నమ్మ కుడియిరుప్పు’ పేరుతో New App

                          - ప్రారంభించిన మంత్రి అన్బరసు


అడయార్‌(చెన్నై), జూలై 20: తమిళనాడు నగర జీవన ప్రమాణాల మెరుగు అభివృద్ధి సంస్థకు చెందిన గృహ వినియోగదారులు చందా సులభంగా చెల్లించేందుకు వీలుగా రూపొందించిన ‘నమ్మ కుడియిరుప్పు’ యాప్‌ను రాష్ట్ర సూక్ష్మ, చిన్నమధ్యతరహా పరిశ్రమల మంత్రి టీఎం అన్బరసు బుధవారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ మొబైల్‌ యాప్‌ను గృహవినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటి నుంచే వివిధ రకాల సేవలు పొందవచ్చని మంత్రి అన్బరసు వెల్లడించారు. 

Updated Date - 2022-07-21T15:26:04+05:30 IST