స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులకు నూతన బ్లాక్‌

ABN , First Publish Date - 2021-07-30T07:26:32+05:30 IST

స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ పేషెంట్లకు నూతన బ్లాక్‌ నిర్మించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులకు నూతన బ్లాక్‌
అధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ ఈవో

తిరుపతి(కొర్లగుంట), జూలై 29: స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ పేషెంట్లకు నూతన బ్లాక్‌ నిర్మించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్విమ్స్‌, టీటీడీ అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. స్విమ్స్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రుల తరహాలో ఆరోగ్య బీమా కలిగిన రోగులకు క్యాష్‌లెస్‌ వైద్య సేవలు అందించాలన్నారు. హెచ్‌ఆర్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్లను రూపొందించుకోవాలన్నారు. రేడియాలజీ ఇమేజింగ్‌ సిస్టమ్‌ (పీఏసీఎస్‌) ద్వారా ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ తీసుకున్న రోగుల స్కానింగ్‌ రిపోర్టులను సంబంధిత డాక్టర్లకు ఆన్‌లైన్‌లో పంపేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని సూచించారు. ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ, పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు. స్టూడెంట్స్‌ సాఫ్‌వేర్‌ను రూపొందించి టీటీడీ విద్యాసంస్థల్లోని విద్యార్థుల వివరాలు పొందుపరచాలన్నారు.  ఈ సమీక్షలో స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్‌ఏ అండ్‌ సీఏవో బాలాజీ, సీఏవో రవిప్రసాద్‌, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, స్విమ్స్‌ ఐటీ మేనేజర్‌ భావన పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T07:26:32+05:30 IST