ఆస్పత్రి నుంచి పసిబిడ్డ చోరీ.. పోలీసులు విచారణ చేస్తుండగా మరో బిడ్డ చోరీ.. చివరికి ఆ దొంగ ఎలా పట్టుబడ్డాడంటే..

ABN , First Publish Date - 2022-03-04T05:52:33+05:30 IST

ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి వార్డు నుంచి ఒక పసిబిడ్డ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణ చేస్తుండగా.. మూడు రోజుల తరువాత అదే నగరంలో మరో పసిబిడ్డ దొంగతనం...

ఆస్పత్రి నుంచి పసిబిడ్డ చోరీ.. పోలీసులు విచారణ చేస్తుండగా మరో బిడ్డ చోరీ.. చివరికి ఆ దొంగ ఎలా పట్టుబడ్డాడంటే..

ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి వార్డు నుంచి ఒక పసిబిడ్డ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణ చేస్తుండగా.. మూడు రోజుల తరువాత అదే నగరంలో మరో పసిబిడ్డ దొంగతనం చేయబడిందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరికి ఆ దొంగ ఎలా దొరికాడంటే..


మధ్య  ప్రదేశ్‌లోని జబల్ పూర్ జిల్లా కట్నీ నగరంలో నివసించే గోమ్తీ బాయి అనే మహిళ ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. గోమ్తీ బాయి ఒకరోజ మధ్యాహ్నం ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో బెడ్డుపై తన బిడ్డతో నిద్రపోతూ ఉంది. ఆమెతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు బయటికి వెళ్లారు. సాయంత్రం గోమ్తీ బాయి నిద్రలేచే సరికి తన పక్కన ఉండాల్సిన బిడ్డ కనబడలేదు. ఆస్పత్రి అంతా వెతికినా ఎక్కడ బిడ్డ ఆచూకీ తెలియలేదు. దీంతో గోమ్తీ బాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసులు ఆస్పత్రిలోని అన్ని సీసీటీవి వీడియోలను పరిశీలించారు. ఒక వీడియోలో బిడ్డను ఎవరు తీసుకెళ్లారో కనిపించింది. గోమ్తీ బాయి నిద్రపోతున్న బెడ్డు పక్కన మరో బెడ్డు మీదు ఒక మహిళ ఒక పసిబిడ్డతో ఉంది. మధ్యాహ్నం వేళ గోమ్తీ బాయి నిద్రపోతున్న సమయంలో ఆ మహిళ గోమ్తీబాయి‌కి పుట్టిన బిడ్డను ఎత్తుకొని తీసుకెళ్లిపోయింది. దీంతో పోలీసులు ఆ మహిళను పట్టుకోవాడానికి నగరంలోని అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా పెంచారు.


కట్నీ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఒక చెక్‌పోస్టు వద్ద ఒక బస్సును తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక మహిళ వద్ద ఇద్దరు పిలల్లుండడం గమనించారు. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేయగా.. ఆమె మూడు రోజుల క్రితం ఒక ఆస్పత్రి నుంచి ఒక పసిబిడ్డను చోరీ చేసిందని తన నేరం అంగీకరించింది. ఆమె వద్ద ఉన్న మరో బిడ్డ గోమ్తీ బాయి‌కు పుట్టిన బిడ్డగా పోలీసుల దర్యాప్తులో తెలిసింది.


ప్రస్తుతం పోలీసులు  గొమ్తీబాయి బిడ్డను తల్లి వద్దకు చేర్చారు. బిడ్డను దొంగతనం చేసిన మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.


Updated Date - 2022-03-04T05:52:33+05:30 IST