
హైదరాబాద్ సిటీ : పురపాలక శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జీహెచ్‌ఎంసీలోని పలువురు ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగింది. తాజాగా మరికొందరిని ట్రాన్స్‌ఫర్ చేశారు. శివార్లలోని మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల కమిషనర్లు కూడా మారారు. ఈ మేరకు శుక్రవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీలోని ఓ అధికారి పురపాలక శాఖలో కీలక హోదాలో ఉన్న స్నేహితుడి ద్వారా కొంత కాలంగా జరుపుతున్న మంత్రాంగం ఫలించి శివారు కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.