కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు

Sep 25 2021 @ 01:10AM
గొలుగొండ ఎంపీపీగా ప్రమాణం చేస్తున్న గజ్జలపు మణికుమారి

  

ప్రశాంతంగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో- ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక  

నర్సీపట్నం, సెప్టెంబరు 24 :  మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు శుక్ర వారం ప్రశాంతంగా ముగిశా యి. మండల పరిషత్‌ అధికారులు ఆయా  మండలాల్లో షెడ్యూల్‌ ప్రకారం  ఎన్నికలు నిర్వహిం చడం, ఇందుకు అన్ని పార్టీల నేతలు తమవంతు సహకారం అందించ డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

నర్సీపట్నం ఎంపీపీగా రాజేశ్వరి 

నర్సీపట్నం అర్బన్‌ : నర్సీపట్నం ఎంపీ పీగా వైసీపీకి చెందిన సుర్ల రాజేశ్వరి ఎన్నిక య్యారు. మండల ఎన్నికల అధికారి సరోజని ఆధ్వర్యంలో  ఎన్ని కల ప్రక్రియ నిర్వ హిం చగా, అమలాపురం ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి ఎంపీపీగా నామినేషన్‌ వేశారు. దీంతో మిగిలిన ఎంపీటీసీలు ఆమెను ఎన్నుకున్నారు. అలాగే, టీడీపీ నుంచి శెట్టిపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన రత్నం వైసీపీలోకి చేరడంతో ఆమె వైస్‌ ఎంపీపీగా ఎన్నిక య్యారు. గురందరపాలేనికి చెందిన షేక్‌ హుస్సేన్‌ను కో-ఆప్షన్‌ సభ్యుడుగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే గణేశ్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ అదిత్‌సింగ్‌, ఎంపీడీవో జయమాధవి తదితరులు పాల్గొన్నారు. 

 నాతవరం ఎంపీపీగా లక్ష్మణమూర్తి 

నాతవరం: ఎంపీపీగా  సరుగుడు సెగ్మెంటు నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన సాగి లక్ష్మణమూర్తి ఎన్నికయ్యారు. వైస్‌ ఎంపీపీగా పైల అప్పలస్వామినాయుడు, మండల కో-ఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌రజాక్‌లను ఎన్ను కున్నారు. ఎన్నికల అధికారి మోహన్‌రావు వీరితో పాటు ఎంపీటీసీలతో ప్రమాణం చేయించారు. ఎంపీడీవో యాదగిరేశ్వరరావు,  వైసీపీ నాయకులు అంకంరెడ్డి జమీలు, శెట్టి నూకరాజు, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.నరసింగరావు సభ్యులను అభినందించారు. నూతన ఎంపీపీ మాట్లాడుతూ అందరి సహకారంతో మండలం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

గొలుగొండ ఎంపీపీగా మణికుమారి

గొలుగొండ : ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గోపీకుమార్‌ ఆధ్వ ర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిం చారు. మండలంలో 15 ఎంపీ టీసీ స్థానాలు ఉండగా,  14 స్థానాలకు ఫలితాలు ప్రకటిం చారు. ఇందులో 13 స్థానాలను వైసీపీకి దక్కించుకుంది. ఇదిలావుంటే, తొలుత కృష్ణాదేవిపేట ఎంపీటీసీ గజ్జలపు మణికుమారి ఎంపీపీగా, చోద్యం ఎంపీటీసీ సుర్ల ఆదినారాయణ వైస్‌ ఎంపీపీగా నామినేషన్లు దాఖలు చేయగా, సభ్యులంతా వీరిని ఎన్నుకున్నారు. కో-ఆప్షన్‌ సభ్యుడుగా షేక్‌ అసూన్‌ ఎన్నికయ్యారు.  ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సుర్ల గిరిబాబు, వైసీపీ నాయకులు చిటికెల భాస్కరనాయుడు, లెక్కల సత్యనారాయణ, నల్లబెల్లి శ్రీనివాసరావు తదితరులు వీరిని అభినందించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.