ఈ కాటన్ మాస్క్‌తో వైరస్, బ్యాక్టీరియా ఖతం!

ABN , First Publish Date - 2020-11-13T03:10:01+05:30 IST

కరోనా వైరస్‌ పని పట్టే టీకా కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న వేళ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఓ కాటన్ మాస్క్ గొప్ప ఆశాకిరణంగా

ఈ కాటన్ మాస్క్‌తో వైరస్, బ్యాక్టీరియా ఖతం!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పని పట్టే టీకా కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న వేళ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఓ కాటన్ మాస్క్ గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తోంది. వైరస్‌, బ్యాక్టీరియాను ఈ మాస్క్ 99.99 శాతం హతమారుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మాస్క్ ధరించి సూర్యకాంతిలో 60 నిమిషాలు ఉంటే వైరస్ ఖతమైపోతుందని పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగేలా మాస్కును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.. దీనిని ధరిస్తే గంటలోనే ఇది 99.9999 శాతం బ్యాక్టీరియా, వైరస్‌ను చంపేస్తుందని వివరించారు. 


ఇందుకు సంబంధించిన పరిశోధన ఫలితాలు ఏసీఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్‌ఫేసెస్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం ఈ మాస్కును ధరిస్తే సూర్యకాంతి పడిన గంటలోనే వైరస్ చనిపోతుంది. ఈ సరికొత్త ఫేస్‌మాస్క్‌ను పదిసార్లు ఉతకవచ్చని, దానిలోని యాంటీమైక్రోబయాల్ చర్యను కోల్పోకుండా కనీసం వారం పాటు సూర్యరశ్మి తగిలేలా చూడాలని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.


ఈ సరికొత్త కాటన్ ఫేస్‌మాస్క్‌పై సూర్యకిరణాలు పడిన వెంటనే రీయాక్టివ్ ఆక్సిజన్ స్పైసెస్ (ఆర్ఓఎస్)ను విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా ఫేస్‌మాస్క్‌పై ఉన్న మైక్రోబ్స్‌ చనిపోతాయని వివరించారు. 2-డైథైలామినోఇథైల్ క్లోరైడ్ (డీఈఏఈ-ఈఐ) ధనాత్మక చార్జ్ గొలుసును సాధారణ కాటన్‌కు అనుసంధానించడం ద్వారా పరిశోధకులు ఈ సరికొత్త కాటన్ ఫ్యాబ్రిక్‌ను తయారు చేశారు.  

Updated Date - 2020-11-13T03:10:01+05:30 IST