నూతన సాగు చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-03-07T04:36:42+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలి
కృష్ణవేణి చౌరస్తాలో ఆందోళన చేస్తున్న నాయకులు

విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు

గద్వాల టౌన్‌, మార్చి 6: కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టి వంద రోజులైన సందర్భంగా శనివారం పలు పార్టీలు, ప్రజా, విద్యార్థి, రైతు సంఘాల నాయకులు కృష్ణవేణి చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. వంద మంది రైతులు ఉద్యమంలో మృత్యువాత పడినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధ్యతారా హిత్యానికి నిదర్శనమన్నారు. కేంద్రం ఇదే ధోరణి కొనసాగిస్తే రైతు ఉద్యమాలు ఉధృతమవుతాయని స్పష్టం చేశారు. ఆందోళలో ఏఐకేఎంఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఉప్పేరు కృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, టీపీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్‌, టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఆలూరు ప్రకాష్‌గౌడ్‌, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంజిపేట రాజు, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్‌, జిల్లా ఖాజా, పీడీఎస్‌యూ, టీవీవీ జిల్లా కన్వీనర్లు హరీష్‌, నాగన్న పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-07T04:36:42+05:30 IST