Advertisement

భీమవరంను జిల్లా కేంద్రం చేయాలి

Nov 29 2020 @ 23:27PM
సమావేశంలో పాల్గొన్న నాయకులు

స్వచ్ఛంద సంస్థల సమావేశం తీర్మానం


భీమవరం, నవంబరు 29: జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఏర్పాటు చేయాలని వివిధ స్వచ్ఛంద సంస్థలు తీర్మానించాయి. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో భీమవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, న్యాయవాది యేలేటి న్యూటన్‌ మాట్లాడుతూ భీమవరంలో అనుకూల పరిస్థితులున్నందున జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సహకారంతో కలెక్టర్‌ను కలుస్తామన్నారు. ఛాంబర్‌ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పట్టణం అభి వృద్ధి, వసతులు సరిపోతాయన్నారు. దళిత నేత గంటా సుందర్‌కుమార్‌, బీజేపీ నేత అరసవల్లి సుబ్రహ్మణ్యం, లంక కృష్ణమూర్తి మాట్లాడారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.