కొత్త జిల్లాలు.. సమస్యలు

ABN , First Publish Date - 2022-06-27T04:39:40+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త సమస్యలు వస్తున్నాయి.

కొత్త జిల్లాలు.. సమస్యలు
అప్‌ గ్రేడ్‌ అవుతున్న అద్దంకి పోలీస్‌స్టేషన్‌

రెండు పోలీసు సర్కిల్‌  కార్యాలయాలు ఏర్పాటు 

అద్దంకి స్టేషన్‌ అప్‌గ్రేడ్‌ 

రెండు సబ్‌డివిజన్‌ల పరిధిలోకి  అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల మండలాలు

సంతమాగులూరు సర్కిల్‌  బాపట్లకు బహుదూరం

అద్దంకి, జూన్‌ 26: కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త సమస్యలు వస్తున్నాయి. పరిపాలన సౌలభ్యం లేకపో గా మరింత దూరం పెరిగింది. ఇప్పటికే రెవెన్యూ డివి జన్‌ల విభజనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొత్తగా ఏర్పాటుచేస్తున్న పోలీస్‌ సబ్‌డివిజన్‌లు కూడా రెండు నియోజకవర్గాలలోని మండలాలను రెండుగా చీల్చాయి. కొత్తగా సంతమాగులూరు సర్కిల్‌ ఏర్పడ్డా సుదూర ప్రాంతంలో ఉన్న  బాపట్ల సబ్‌డివిజన్‌ పరిధి లోకి చేర్చటంతో సంతమాగులూరు, బల్లికురవ మండ లాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. 

అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ మండ లాలను కలిపి సంతమాగులూరు సర్కిల్‌ ఏర్పాటుచేశారు. పర్చూరు నియోకవర్గంలోని మార్టూరు, యద్దనపూడి, పర్చూరు పోలీస్‌ స్టేషన్‌లను కలిపి మార్టూరు సర్కిల్‌ ఏర్పాటుచేశారు. ఈ రెండు సర్కిళ్ళను బాపట్ల సబ్‌డివిజన్‌ పరిధిలో చేర్చారు. అద్దంకి పోలీస్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేయగా, మేదర మెట్ల, కొరిశపాడు, పంగులూరు పోలీస్‌స్టేషన్‌లను కలిపి అద్దంకి రూరల్‌ సర్కిల్‌గా  చేశారు. 

పర్చూరు నియోజకవర్గంలోని  కారంచేడు, ఇం కొల్లు, చినగంజాం పోలీస్‌స్టేషన్‌లను ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలో ఉంచారు. వీటిని చీరాల సబ్‌డివిజన్‌ పరిధిలో కలిపారు. దీంతో అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల లోని పోలీస్‌ స్టేసన్‌లు అటు బాపట్ల, ఇటు చీరాల సబ్‌డివిజన్‌లలోకి చీలిపోయాయి. కొత్తగా సర్కిల్‌ కా ర్యాలయాలు అందుబాటులోకి వచ్చినా అద్దంకి నియో జకవర్గంలోని పోలీస్‌స్టేషన్‌లకు, సర్కిల్‌ కార్యాలయా లకు రెండు  సబ్‌డివిజన్‌ కేంద్రాలు దూరమయ్యాయి.  సంతమాగులూరు నుంచి బాపట్లకు వెళ్ళాలంటే సు మారు వంద కి.మీ దూరం ప్రయాణించటంతో పాటు రెండు, మూడు బస్సులు మారి చేరాల్సిన పరిస్థితి ఉంది. కొత్తగా రేపల్లె సబ్‌ డివిజన్‌ ఏర్పాటుతో బాపట్ల సబ్‌డివిజన్‌లో పోలీస్‌ స్టేషన్‌లు  తక్కువగా  ఉండ టం, చీరాల  సబ్‌డివిజన్‌లో ఎక్కువ పోలీస్‌ స్టేషన్‌ లు ఉండటంతో అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగు లూరు సర్కిల్‌, పర్చూరు నియోజకవర్గం పరిధిలోని మార్టూరు సర్కిల్‌లను బాపట్ల సబ్‌డివిజన్‌ పరిధిలోకి చేర్చారు. 

అయితే అద్దంకి సబ్‌ డివిజన్‌ ఏర్పాటుచే సి అద్దంకి నియోజకవర్గంలోని పోలీస్‌ స్టేషన్‌లతో పాటు మార్టూరు సర్కిల్‌ను చేర్చి ఉంటే మరింత ప్రయోజ నకరంగా ఉండేదన్న అభిప్రాయం  పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-06-27T04:39:40+05:30 IST