Dubai Visa Rules: దుబాయిలో ఎంట్రీకి మూడు కొత్త రూల్స్.. ఆ దేశ వలస కార్మికులతో ఇబ్బందులు పడకూడదనే..!

ABN , First Publish Date - 2022-09-03T19:03:08+05:30 IST

ఇతర దేశాల పౌరుల మాదిరిగానే నైజీరియన్లు కూడా వ్యాపారం, పర్యాటకం కోసం తరచూ దుబాయ్‌ను సందర్శరించడం కామన్.

Dubai Visa Rules: దుబాయిలో ఎంట్రీకి మూడు కొత్త రూల్స్.. ఆ దేశ వలస కార్మికులతో ఇబ్బందులు పడకూడదనే..!

దుబాయ్: ఇతర దేశాల పౌరుల మాదిరిగానే నైజీరియన్లు కూడా వ్యాపారం, పర్యాటకం కోసం తరచూ దుబాయ్‌ను (Dubai) సందర్శరించడం కామన్. అయితే, తాజాగా వారికి ఓ చిక్కువచ్చి పడింది. ఇకపై నైజీరియన్లు (Nigerians) దుబాయ్ వెళ్లాలంటే కచ్చితంగా మూడు కొత్త రూల్స్ పాటించాల్సిందే. లేనిపక్షంలో వారికి దుబాయ్‌లో ఎంట్రీ ఉండదు. కొంతమంది ఆఫ్రికన్లు దుబాయ్‌లో తరచూ దోపిడీ, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతూ అశాంతికి కారణమవుతున్నారని తేలింది. అందులోనూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నవారిలో నైజీరియన్లు అధికంగా ఉంటున్నారు. దాంతో దుబాయ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కోవలో నేరాలకు పాల్పడి ఇప్పటికే చాలా మంది నైజీరియన్లు దేశం నుంచి బహిష్కరించబడ్డారని (Deported) ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు. మునుముందు ఇలాంటివి పునరావృతం కాకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. 


ఇకపై నైజీరియన్లు దుబాయ్‌లో కాలు పెట్టాలంటే పాటించాల్సిన మూడు కొత్త రూల్స్ ఏంటంటే..

1. తప్పనిసరిగా హోటల్ రిజర్వేషన్‌ను కలిగి ఉండడం

2. ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్

3. రిటర్న్ విమాన టికెట్ 


ఈ నేపథ్యంలో దేశ పౌరులకు నైజీరియన్ ఫెడరల్ ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇకపై దుబాయ్ వెళ్లేవారు నిజాయితీగా వీసాలతోనే వెళ్లాలని సూచించింది. అలాగే యూఏఈ ప్రభుత్వం ఇకనుంచి కేవలం 40 ఏళ్లకు పైబడిన నైజీరియన్లకు మాత్రమే టూరిస్ట్ వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించిందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నైజీరియన్ డయాస్పోర కమిషన్ (NIDCOM) సీఈఓ అబైక్ డబిరి తెలిపారు. అయితే, ఈ నిబంధన నుంచి ఫ్యామిలీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.  ఇక కొత్త నిబంధనల నేపథ్యంలో నైజీరియన్లకు తప్పకుండా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేయనున్నారు. దీనిలో భాగంగా ఐ స్క్రీనింగ్ (Eye screening) తప్పనిసరి. ఈ సమయంలో కంటి పరీక్షలతో పాటు విజిటర్లు సంబంధిత అధికారులకు తమ ఒరిజినల్ వీసా చూపించాల్సి ఉంటుంది. కాగా, నైజీరియన్లకు ఈ కొత్త రూల్స్ ఈ సెప్టెంబర్ నుంచే ప్రారంభించాలని యూఏఈ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక ప్రవేశ వీసా, రెసిడెన్సీ స్కీమ్ రూల్స్‌ను రూపొందించే పనిలో ఉంది.   


Updated Date - 2022-09-03T19:03:08+05:30 IST