‘నూతన విద్యా విధానంపై చర్చించాలి’

ABN , First Publish Date - 2021-07-26T03:53:29+05:30 IST

నూతన విద్యా విధానంపై చర్చ జరపాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు డి.ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.

‘నూతన విద్యా విధానంపై చర్చించాలి’
మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు

విజయనగరం రూరల్‌: నూతన విద్యా విధానంపై చర్చ జరపాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు డి.ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం కోట జంక్షన్‌ సమీపంలోని ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో ఆయన  మాట్లాడుతూ.. ప్రాథమిక తరగతులను విడదీయరాదన్నారు.  ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, మేధావులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. కరోనాతో చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు.  సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని,  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు  పైడిరాజు, సదాశివరావు, కృష్ణ, బలరాం ఉన్నారు.
 
 

Updated Date - 2021-07-26T03:53:29+05:30 IST