శాంసంగ్‌ నుంచి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్లు

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

శాంసంగ్‌ నాలుగో జనరేషన్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌ - గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌4 ఈ నెలలోనే విడుదల కానున్నాయి. మార్పులు చిన్నపాటివే అయినా అర్థవంతమైన అప్‌గ్రేడ్స్‌తో ఇవి వస్తున్నాయి.

శాంసంగ్‌ నుంచి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్లు

శాంసంగ్‌ నాలుగో జనరేషన్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌ - గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌4 ఈ నెలలోనే విడుదల కానున్నాయి. మార్పులు చిన్నపాటివే అయినా అర్థవంతమైన అప్‌గ్రేడ్స్‌తో ఇవి వస్తున్నాయి.


  • క్లామ్‌షెల్‌ డిజైన్‌తోనే వస్తున్నాయి. దీనికి ముందు విడుదలైన ఫోన్‌తో పోల్చుకుంటే చిన్న మార్పులు చేశారు. మెయిన్‌ స్ర్కీన్‌ 6.7 ఇంచీలు కాగా 120 హెచ్‌జెడ్‌ వేరియబుల్‌ రిఫ్రెష్‌ రేట్‌ కలిగి ఉన్నాయి. మన్నిక 45 శాతం ఎక్కువ. కార్నింగ్స్‌కు చెందిన గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్లస్‌ను ఉపయోగించారు. హింగర్‌ స్ట్రాంగ్‌గా ఉంది. గ్లాసియర్‌ ఫినిషింగ్‌తో ఉంది. 
  • గెలాక్సీ జెడ్‌ఫ్లిప్‌ 4 ఆండ్రాయిడ్‌ 12తో రన్‌ అవుతుంది. నాలుగేళ్ళు మేజర్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, అయిదేళ్ళపాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ లభిస్తాయి.
  • కవర్‌ స్ర్కీన్‌ సైజ్‌లో మార్పు లేదు.
  • వేగవంతమైన ఆండ్రాయిడ్‌ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జన్‌1 అది. 
  • గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌4 కి బ్యాటరీ బంప్‌ ఉంటుంది. 3700 ఎంఎహెచ్‌ బ్యాటరీ బూస్టప్‌ ఉంటుంది. 
  • చార్జింగ్‌ వేగం 25 వాట్స్‌. వైర్‌లెస్‌ చార్జింగ్‌ పది వాట్స్‌ వేగం.
  • దీని బరువు 263 గ్రాములు
  • కెమెరా స్పేస్‌లో మార్పు లేదు. సాఫ్ట్‌వేర్‌ను మాత్రం అప్‌గ్రేడ్‌ చేశారు. 12 మెగా పిక్సెల్‌ చిప్‌ ఉంది. 4 ఎస్‌ సెన్సర్‌, పిక్సెల్‌ పెద్దవి. ఇంతకుమునుపు దాని మాదిరిగానే 12 మెగాపిక్సెల్‌ అలా్ట్రవైడ్‌, 10 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 
  • 8జీబీ ర్యామ్‌కు తోడు  512 జీబీ, 265 జీబీ, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి. అయితే శాంసంగ్‌ మూడు మోడల్స్‌ని ఇండియాలో విడుదల చేస్తుందా లేదా అన్నది మాత్రం తెలియదు.
  • బోరా పర్పుల్‌, గ్రాఫైట్‌, పింక్‌-గోల్డ్‌, బ్లూ కలర్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. 
  • 1.5 మీటర్ల అడుగులోతున్న ఫ్రెష్‌ వాటర్‌లో 30 నిమిషాల సేపు రెసిస్ట్‌ కాగలదు. డస్ట్‌ రెసిస్టెంట్‌ మాత్రం కాదు.

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST