ltrScrptTheme3

పవర్ స్టార్ హీరోయిన్ గా కొత్తమ్మాయి?

Oct 27 2021 @ 10:10AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాల్ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రాలతో పాటు సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చేఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్ని చేస్తుండడంతో సూరి ఈ గ్యాప్ లో అఖిల్ తో ‘ఏజెంట్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైమ్ కి పవన్ సినిమాను సురేంద్ర రెడ్డి ప్రారంభించనున్నారు. 



ఇందులో పవన్ సరసన సరికొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారట సురేంద్రరెడ్డి. ఆమె పేరు సాక్షి వైద్య. ఆల్రెడీ ఆమె ‘ఏజెంట్’ లో కథానాయికగా నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. మరి అందులో ఆమె ఖాయం అయిందో లేదో తెలియదు కానీ.. పవర్ స్టార్ మూవీలో మాత్రం కన్ఫామ్ అంటున్నారు. ఇప్పటికే నిర్మాత హీరోయిన్ తో అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే ఏడాది తెలియనున్నాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.