వచ్చే ఏడాది దీపావళికి దుబాయిలోని కొత్త హిందూ దేవాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-25T15:50:35+05:30 IST

యూఏఈలో కొత్తగా నిర్మిస్తున్న హిందూ దేవాలయం వచ్చే ఏడాది అక్టోబర్‌కు పూర్తవనున్నట్టు దేవాలయ ట్రస్టీ రాజు ష్రాఫ్ ఆదివారం

వచ్చే ఏడాది దీపావళికి దుబాయిలోని కొత్త హిందూ దేవాలయం ప్రారంభం

దుబాయి: యూఏఈలో కొత్తగా నిర్మిస్తున్న హిందూ దేవాలయం వచ్చే ఏడాది అక్టోబర్‌కు పూర్తవనున్నట్టు దేవాలయ ట్రస్టీ రాజు ష్రాఫ్ ఆదివారం వెల్లడించారు. 2022 దీపావళికి దేవాలయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దేవాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే బేస్‌మెంట్ పూర్తయినట్టు పేర్కొన్నారు. ఈ దేవాలయానికి గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. బర్ దుబాయి‌లో ఉన్న సింధి గురు దర్బార్ దేవాలయానికి పొడిగింపుగా ప్రస్తుత దేవాలయ నిర్మాణం జరుగుతోంది. దుబాయిలో ఉన్న పురాతన దేవాలయాల్లో సింధి గురు దర్బార్ దేవాలయం ఒకటి. 1950లలో ఈ దేవాలయం ప్రారంభమైంది. కొత్తగా నిర్మించబోయే దేవాలయం అరేబియన్ లుక్‌లో కనిపించనున్నట్టు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-01-25T15:50:35+05:30 IST