అమెరికా తెలుగు సంఘాల్లో నూతనోత్సాహం

Published: Thu, 24 Mar 2022 07:19:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమెరికా తెలుగు సంఘాల్లో నూతనోత్సాహం

రికార్డు స్థాయిలో తానా సభ్యత్వ నమోదు     

28న 40 నగరాల్లో టీడీపీ వేడుకలు

కొవిడ్‌ వల్ల గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో నిలిచిపోయిన తెలుగు సంఘాల కార్యకలాపాలు తిరిగి పునరుత్తేజంతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని తెలుగు సంఘాలు రెట్టించిన ఉత్సాహంతో ఉత్సవాలు, మహాసభలు, వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఏప్రిల్‌ 2న ఉగాది వేడుకలు భారీస్థాయిలో నిర్వహించడానికి దాదాపు అన్ని తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. కాగా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల  28న అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో 40 నగరాల్లో విజయోత్సవాలు నిర్వహించనున్నారు.


మే చివరి వారంలో అమెరికాలో పెద్దఎత్తున మహానాడు వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇక అమెరికాలోని పలు తెలుగు సంఘాలు వార్షిక మహాసభల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (తానా) సభ్యత్వ నమోదులో రికార్డు నెలకొల్పింది. తానా ఏర్పడి దాదాపు 45 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఈ సంస్థలో 36 వేల  మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ఇటీవల 30వేల మంది కొత్తగా చేరడంతో ఆ సంఖ్య  రికార్టు స్థాయిలో 70 వేలు దాటింది. నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో డల్లాస్‌ నగరంలో మహాసభలు నిర్వహించనున్నారు. తెలంగాణా తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ)  ఆధ్వర్యంలో  మే 27 నుంచి మూడు రోజుల పాటు న్యూజెర్సీలో మహాసభలు నిర్వహించడానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.  అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) జులై 1, 2 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలో 17వ మహాసభలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆటా అధ్యక్షుడు భువనేష్‌ భుజాల ఆధ్వర్యంలో  ఉత్సవాల నిర్వహణకు పెద్దఎత్తున నిధులను కూడా సమీకరించారు. మరొక తెలుగు సంస్థ నాటా (ఎన్‌ఏటీఏ)  ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నూతన భవనం నిర్మించడానికి నిధులు సేకరిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.