కాంగ్రె్‌సలో నయా జోష్‌

ABN , First Publish Date - 2022-05-23T06:07:34+05:30 IST

కాంగ్రె్‌సలో నయా జోష్‌

కాంగ్రె్‌సలో నయా జోష్‌
కొడంగల్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి


  • రచ్చబండ కార్యక్రమాలతో పార్టీ నేతల్లో కదనోత్సాహం

వికారాబాద్‌, మే22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో నిర్వహించిన రైతుతో రచ్చబండ సభలు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నయా జోష్‌ నింపింది. కొడంగల్‌ నియోజకవర్గంలో బొంరా్‌సపేట్‌ మండలంలో తుంకిమెట్ల, కొడంగల్‌ మండలంలో అంగడి రాయ్‌చూర్‌, దౌల్తాబాద్‌ మండలంలో చంద్రకల్‌లో నిర్వహించిన రైతుతో రచ్చబండ సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి చేసిన విమర్శనాస్త్రాలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది. నిర్ణయించిన సమయం కంటే రేవంత్‌రెడ్డి ఆలస్యంగా వచ్చినా ప్రజలు ఎంతో ఓపికతో ఎదురు చూడడం విశేషం. వరంగల్‌ డిక్లరేషన్‌లో ఆమోదించిన అంశాల గురించి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో వివరిస్తుంటే.. పార్టీ శ్రేణులు, ప్రజలు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో మూడు చోట్ల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలు విజయవంతం కావడం పార్టీకి కొత్త ఊపునిచ్చింది. రచ్చబండ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వచ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఒకవైపు రేవంత్‌రెడ్డి ప్రసంగం కొనసాగుతూ ఉంటే, మరోవైపు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో పటాసులు పేల్చి తమ సంతోషం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా నిస్పృహతో ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో రచ్చబండ కార్యక్రమం జోష్‌ నింపింది. 

మిగతా నియోజకవర్గాల్లోనూ..

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న రైతుతో రచ్చబండ సభలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఊపిరి నింపుతోంది. వికారాబాద్‌ నియోజకవర్గంలో మైలార్‌దేవరంపల్లి, పరిగి నియోజకవర్గంలో కులకచర్ల, చౌడాపూర్‌, తాండూరు నియోజకవర్గంలో పెద్దేముల్‌ మండలంలో గొట్లపల్లి, హన్మాపూర్‌, జయరాంతండా, ఆత్కూర్‌, ఆత్కూర్‌ తండాల్లో రచ్చబండ సభలు జరిగాయి. వికారాబాద్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, పరిగి నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ మహరాజ్‌ రచ్చబండ సభలకు హాజరై వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి వివరించారు. రచ్చబండ కార్యక్రమానికి యువకులు, ముఖ్యంగా రైతుల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంపార్టీ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 

రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరిన రుద్రారం మాజీ ఎంపీటీసీ 

రుద్రారం మాజీ ఎంపీటీసీ చెన్నారెడ్డి రేవంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. చెన్నారెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన నాయకులకు రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

Updated Date - 2022-05-23T06:07:34+05:30 IST